Ram Charan, Sukumar: రాజమౌళి చెప్పిన సీన్‌… సుకుమార్‌ ఉంచుతారా? హార్ట్‌ ఎటాక్‌ తెప్పించే ఆ సీన్‌ ఏంటో?

రామ్‌చరణ్‌ (Ram Charan) – సుకుమార్‌  (Sukumar) కాంబినేషన్‌లో మరో సినిమా ఉంటుంది అని చాలా నెలలుగా వార్తలొస్తున్నాయి. అయితే ఏమైందో ఏమో కానీ ఆ సినిమాను ఇన్నాళ్లూ దాస్తూ వచ్చిన మైత్రి మూవీ మేకర్స్‌ హఠాత్తుగా నిన్న ప్రకటించేసింది. దీంతో కొత్త సినిమా, రెండోసారి చేస్తున్నారు అంటూ ఈ సినిమా గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. అయితే ఇక్కడో విషయం ఏంటంటే… ఈ సినిమా షూటింగ్‌ ఎప్పుడో స్టార్ట్‌ అయిపోయింది. అంతేకాదు ఆ సినిమా కథ రాజమౌళికి (S. S. Rajamouli) కూడా తెలుసు. కొన్ని సీన్స్‌ కూడా తెలుసు. ముఖ్యంగా ఓపెనింగ్‌ సీక్వెన్స్‌ చూస్తే ప్రేక్షకులు అదిరిపోతారు అని చెప్పారు జక్కన్న.

అది ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ (RRR) సినిమా ప్రచారం జరుగుతున్న సమయం. ఓ ఇంటర్వ్యూలో ఓ ప్రశ్నకు రామ్‌చరణ్‌ త్వరలో సుకుమార్‌తో సినిమా ఉంటుంది అని చెప్పి క్లోజ్‌ చేసేస్తుంటే… ఆ సినిమాలో ఓపెనింగ్‌ సీన్‌ అదిరిపోతుంది. అయితే దాని గురించి ఇప్పుడు చెప్పేస్తే సుకుమార్‌కు హార్ట్‌ ఎటాక్‌ వచ్చేస్తుంది అని అన్నారు. దీంతో అప్పుడు ఆ సీన్‌ గురించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ సినిమా ఇంకా స్టార్ట్‌ కాకపోవడం, డిస్కషనూ లేకపోవడంతో ఇక ఆ సినిమా లేదేమో అనుకున్నారంతా. అయితే ఆ సమయంలో సాబు సిరిల్‌ తనయుడు ఎక్కడో ఇంటర్వ్యూలో చెప్పిన మరో విషయం షాకింగ్‌ గురిచేసింది.

ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు అని అంటున్న దాని ప్రకారం. ఆ సినిమాలో రామ్‌చరణ్‌ ఇంట్రడక్షన్‌ సీన్‌ షూటింగ్‌ అయిపోయిందట. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ సినిమా షూటింగ్‌ గ్యాప్‌లో ఓసారి చరణ్‌, సుకుమార్‌ అనుకొని ఆ సీన్‌ షూట్‌ చేసేశారు అని చెబుతున్నారు. సినిమా మొదలయ్యాక షూట్‌ చేస్తే విషయం బయటకు వచ్చేస్తుంది కాబట్టి… ముందే ఆ సీన్‌ చిత్రీకరించారు అని అంటున్నారు. అంత స్పెషల్‌ ఏముంది ఆ సీన్‌లో అని అప్పుడు అనుకున్నారు. ఇప్పుడు అఫీషియల్‌గా సినిమా అనౌన్స్‌ అవ్వడంతో ఆ సీన్‌ గురించి మళ్లీ చర్చ మొదలైంది.

ఇక సినిమా కొత్ సంగతులు చూస్తే… ఈ ఏడాదిలోనే సినిమా చిత్రీకరణకు శ్రీకారం చుడతారు. వచ్చే ఏడాది ఆఖర్లో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే అనుకున్న సమయానికి సినిమా రిలీజ్‌ చేయడం ఇటీవల కాలంలో సుకుమార్‌ నుండి, చరణ్‌ నుండి చూడలేకపోతున్నాం. కాబట్టి రిలీజ్‌ డేట్‌ సంగతి చూద్దాం.

సైలెంట్ గా పెళ్లి పీటలెక్కిన ‘బిగిల్’ నటి ఇంద్రజ..!

కర్ణాటకలో సినిమాలు బ్యాన్‌ అంటున్నారు… మన దగ్గరా అదే చేస్తారా?
ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్న 18 సినిమాలు/ సిరీస్..ల లిస్ట్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus