మెగా పవర్ స్టార్ రాంచరణ్ మళ్ళీ తండ్రి కాబోతున్నారా? అంటే అవుననే సమాధానాలు సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ విషయంపై అటు చరణ్ నుండి కానీ, చరణ్ టీం నుండి కానీ ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదు. పైగా రామ్ చరణ్ కి సంబంధించి అభిమానులకి ఎక్కువ అప్డేట్స్ ఇచ్చేది అతని సతీమణి ఉపాసనే..! అలాంటిది ఆమె 2వ సారి గర్భం దాల్చినప్పుడు ఆ విషయాన్ని ఎందుకు హైడ్ చేస్తుంది. సోషల్ మీడియాలో హ్యాపీగా షేర్ చేస్తుంది కదా.? అసలు ఈ ప్రచారం ఎలా మొదలైంది? ఎందుకు మొదలైంది? ఇందులో ఎంత నిజం ఉంది?
ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం.. రామ్ లీలా మైదానంలో జరిగిన రావణ దహనం వేడుకలో చరణ్, ఉపాసన పాల్గొన్నారు. ఇందులో భాగంగా చరణ్.. ఉపాసనని చెయ్యి పట్టుకుని జాగ్రత్తగా నడుస్తున్నాడట. అలాగే ఉపాసన కూడా తన పొట్ట కనబడకుండా చున్నీతో కవర్ చేసుకుందట. అందుకే ఈ ఫోటో చూసిన సోషల్ మీడియా సైంటిస్టులు.. ‘సంథింగ్ ఈజ్ ఫిషీ’ అనుకుంటూ తమ అనాలిసిస్ మొదలుపెట్టి.. ఈ గాసిప్ ను ప్రచారం చేశారు. అంతే తప్ప ఇప్పటివరకు ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
మరోపక్క రామ్ చరణ్ ఇప్పుడు ‘పెద్ది’ సినిమాపై ఫుల్ ఫోకస్ పెట్టాడు. బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చరణ్ .. స్పోర్ట్స్ మెన్ గా కనిపించనున్నాడు. ఇది కూడా బుచ్చిబాబు గత చిత్రం ‘ఉప్పెన’ మాదిరి రూరల్ బ్యాక్ డ్రాప్ మూవీనే. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తుంది.