‘ఆచార్య’ లో రాంచరణ్ కు జోడీగా ఆ క్రేజీ బ్యూటీ..!

మెగాస్టార్ చిరంజీవి – కొరటాల శివ కాంబినేషన్లో ‘ఆచార్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై రాంచరణ్, నిరంజన్ రెడ్డి లు కలిసి నిర్మిస్తున్నారు. ఆగష్టులో ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలని మొదట ప్లాన్ చేశారు కానీ ఇప్పుడు అది వర్కౌట్ అయ్యేలా కనిపించడం లేదు. ఇక ఈ చిత్రం నుండీ హీరోయిన్ త్రిష కూడా తప్పుకున్న సంగతి తెలిసిందే. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల ఆమె తప్పుకుంటున్నట్టు ఇటీవల తన ట్విటర్ ద్వారా తెలిపింది. ఇప్పుడు చిరు కోసం హీరోయిన్ ను వెతికే పనిలో దర్శకుడు కొరటాల బిజీగా గడుపుతున్నాడు. అనుష్క మరియు కాజల్ లో ఒకరిని ఫైనల్ చేసే అవకాశం ఉందనే చర్చ నడుస్తుంది.

ఇదిలా ఉండగా.. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషించనున్నట్టు వార్తలు వస్తోన్న సంగతి తెలిసిందే. మొదట ఈ పాత్రకి మహేష్ ను అనుకున్నా.. బడ్జెట్ ఎక్కువైపోతుందని లైట్ తీసుకున్నారు నిర్మాతలు. సినిమాలో 30 నిమిషాల పాటు ఉండే ఈ పాత్రను చరణ్ తోనే చేయించాలని వారు డిసైడ్ అయ్యారు. ఉగాది రోజున అధికారిక ప్రకటనతో పాటు.. చిరు, చరణ్ లు ఉండే ఓ పోస్టర్ ను కూడా విడుదల చేయబోతున్నారని సమాచారం. మరోపక్క చరణ్ కు కూడా ఈ చిత్రంలో హీరోయిన్ ఉండాలట. అందుకోసం ‘సరిలేరు నీకెవ్వరు’ బ్యూటీ రష్మిక మందన ను అనుకుంటున్నట్టు సమాచారం. దాదాపు ఈమెనే ఫైనల్ చేస్తే బాగుంటుందని.. చరణ్, రష్మిక పెయిర్ కూడా ఫ్రెష్ గా ఉంటుందని చిరు.. దర్శకుడు కొరటాలతో చెప్పినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు
మోస్ట్ డిజైరబుల్ విమెన్ 2019 లిస్ట్
టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2019 లిస్ట్
సొంత మరదళ్ళను పెళ్లాడిన టాప్ స్టార్స్

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus