సూపర్ స్టార్ మహేష్ బాబు కి విదేశాల్లో చాలా మంది అభిమానులున్నారు. అందుకే ఆయన సినిమాలకు ఓవర్ సీస్ లో మంచి మార్కెట్ ఉంటుంది. ఇక్కడ ఫెయిల్ అయిన చిత్రాలు సైతం అక్కడ భారీ కలెక్షన్లను రాబట్టాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాల్లో కోట్లు కొల్లగొట్టినా ఓవర్ సీస్ లో హావ కనిపించేది కాదు. ఎప్పుడైతే కథల్లో మార్పు చూపించారో అప్పటినుంచి తారక్ కి విదేశాల్లో ఫాలోయింగ్ పెరిగింది. బాద్ షాతో తొలిసారి మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన ఎన్టీఆర్ ఆ తర్వాత అదే జోరు కొనసాగించారు. ఈ ఏడాదిలో రిలీజ్ అయిన నాన్నకు ప్రేమతో రెండు మిలియన్ డాలర్లు, జనతా గ్యారేజ్ 1 .8 మిలియన్ డాలర్లు వసూల్ చేసింది. దీంతో ఈ ఇయర్ అమెరికాలో 3.8 మిలియన్ డాలర్లు సాధించిన హీరోగా తారక్ కిరీటం అందుకున్నారు.
ఒక్క సినిమా విషయంలో మాత్రం అ..ఆ ముందుంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీకి రెండున్నర మిలియన్ డాలర్ల కలక్షన్ వచ్చింది. ఈ రెండు రికార్డులను బీట్ చేయడానికి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ ప్రయత్నిస్తున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ గా చెర్రీ నటించిన ధృవ ఈ నెల 9 న రిలీజ్ అయింది. ఐదు రోజులకే అమెరికాలో ఒక మిలియన్ డాలర్లను వసూల్ చేసింది. దీంతో ఈ వారాంతంలో రెండు మిలియన్ డాలర్ల మార్క్ ని ధృవ రీచ్ అవుతుందని ట్రేడ్ వర్గాల వారు అంచనా చేస్తున్నారు. అయినప్పటికీ ఎన్టీఆర్ పేరిట ఉన్న 2016 టోటల్ కలక్షన్ రికార్డ్ ని రీచ్ కాలేరని ఆయన అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.