Ram Charan: వామ్మో…కోట్లు విలువ చేసే వాచ్ ధరించిన చరణ్!

వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి ఇటలీలో ఎంతో ఘనంగా పెళ్లి చేసుకున్న సంగతి మనకు తెలిసిందే. నవంబర్ ఒకటవ తేదీ వీరి వివాహం జరిగింది. అయితే ఈ పెళ్లి వేడుకలలో మెగా కుటుంబ సభ్యులందరూ పాల్గొని సందడి చేశారు. ఇక ఈ పెళ్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పెళ్లికి సంబంధించిన ఒక్కొక్క ఫోటో బయటకు రావడంతో మెగా అభిమానులు ఈ ఫోటోలను మరింత వైరల్ చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఈ పెళ్లి వేడుకకు వారు ధరించిన డ్రెస్సులు వాచ్ అలాగే నగలు అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే నేటిజన్స్ వాటి ఖరీదు ఎంత అని ఆరా తీయడం కూడా మొదలుపెట్టారు. ఇక ఈ పెళ్లి వేడుకలలో భాగంగా రామ్ చరణ్ తన బాబాయ్ పవన్ కళ్యాణ్ తో కలిసి సరదాగా నవ్వుకుంటూ ఉన్నటువంటి ఒక ఫోటో వైరల్ గా మారింది. ఇలా ఈ పెళ్లి వేడుకలలో బాబాయ్ అబ్బాయి ఇద్దరు నవ్వుతూ కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోని తెగ వైరల్ చేస్తున్నారు.

ఇక ఈ ఫోటోలో రామ్ చరణ్ (Ram Charan) చాలా స్టైలిష్ సింపుల్ లుక్ లో అందరిని ఆకట్టుకుంటున్నారు. ఇకపోతే ఈ ఫోటోలో భాగంగా రామ్ చరణ్ తన చేతికి ధరించిన వాచ్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ క్రమంలోనే ఆ వాచ్ గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. అయితే ఈ వాచ్ ఖరీదు తెలిసి ఒక్కసారిగా ఫ్యాన్స్ కంగుతున్నారు. రామ్ చరణ్ ధరించిన ఈ వాచ్ కోట్ల రూపాయల విలువ చేస్తుందని తెలిసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతున్నారు. రామ్ చరణ్ ఈ పెళ్లిలో ధరించిన వాచ్ పెటక్ ఫిలిప్పీ మోడల్ అంటా.

దాని ఖరీదు వచ్చి 285000 డాలర్స్ అని, ఇండియన్ కరెన్సీలో 2 కోట్ల 85 లక్షల ఖరీదు అని తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు అయితే రామ్ చరణ్ కు ఇలా వాచెస్ అంటే చాలా ఇష్టమని ఆయన ఇప్పటికే ఎన్నో ఖరీదైన బ్రాండెడ్ కంపెనీ వాచ్ లను కొనుగోలు చేసినట్లు పలు సందర్భాలలో వెల్లడించారు. ఇక ఇటలీలో పెళ్లి వేడుకలలో పాల్గొన్నటువంటి మెగా కుటుంబ సభ్యులందరూ ఒక్కొక్కరుగా తిరిగి ఇండియా చేరుకుంటున్నారు. అనంతరం హైదరాబాదులో నవంబర్ 5వ తేదీ నిర్వహించబోయే రిసెప్షన్ లో పాల్గొనబోతున్నారు.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus