Ram Charan: చరణ్ విషెస్ తో లెక్క మారినట్టేనా.. దేవరకు సపోర్ట్ లభిస్తుందా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రామ్ చరణ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) తో స్నేహంగా ఉంటారనే సంగతి తెలిసిందే. చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ (RRR) మూవీ బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్ సైతం తెరకెక్కే ఛాన్స్ అయితే ఉంది. అయితే ఆర్ఆర్ఆర్ రిలీజ్ తర్వాత చరణ్ (Ram Charan), ఎన్టీఆర్ ఫ్యాన్స్ మధ్య వార్ మొదలైందనే సంగతి తెలిసిందే. దేవర (Devara) ఫస్ట్ ట్రైలర్ రిలీజ్ తర్వాత ఎక్కువ సంఖ్యలో ట్రోల్స్ రావడానికి మెగా ఫ్యాన్స్ కారణమని చాలామంది భావిస్తారు.

Ram Charan

అయితే దేవరకు గేమ్ ఛేంజర్ ఆల్ ది బెస్ట్ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది. చరణ్ ట్వీట్ తో ఫ్యాన్ వార్ కు చెక్ పడినట్టేనని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దేవరకు మెగా ఫ్యాన్స్ సపోర్ట్ సైతం లభిస్తోందని లెక్క మారినట్టేనని తారక్ ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ దేవర ఫస్ట్ డే కలెక్షన్లు 130 కోట్ల రూపాయల నుంచి 150 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.

ఒక్కో ప్రాంతంలో ఒక్కో సమయానికి దేవర షోలు ప్రదర్శితం అవుతుండటం గమనార్హం. టాక్ పాజిటివ్ గా వస్తే మాత్రం తారక్ క్రియేట్ చేసే రికార్డులు మామూలుగా ఉండవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. సోలో హీరోగా యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు దేవర ఎన్నో రికార్డులను అందిస్తోందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

దేవర సినిమాతో ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ మిక్కిలినేని సుధాకర్ నిర్మాతగా పరిచయమవుతున్నారు. టికెట్ రేట్ల పెంపు దేవర సినిమాకు ఎంతగానో ప్లస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. దేవర బాక్సాఫీస్ ను షేక్ చేయడం పక్కా అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

 ‘దేవర’ విషయంలో దర్శకుడు కొరటాల మెచ్యూర్డ్ డెషిషన్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus