Devara: ‘దేవర’ విషయంలో దర్శకుడు కొరటాల మెచ్యూర్డ్ డెషిషన్.!

  • September 26, 2024 / 07:00 PM IST

‘మిర్చి’ (Mirchi) ‘శ్రీమంతుడు’ (Srimanthudu) ‘జనతా గ్యారేజ్’ Janatha Garage) ‘భరత్ అనే నేను’ (Bharath Ane Nenu) వంటి బ్యాక్ టు బ్యాక్ హిట్లతో స్టార్ డైరెక్టర్ అయిపోయాడు కొరటాల శివ (Koratala Siva)  . అయితే వీటి తర్వాత చేసిన ‘ఆచార్య’.. (Acharya) ఓ పదేళ్ల పాటు మర్చిపోలేని డిజాస్టర్ గా మిగిలిపోయింది. ఈ సినిమా విషయంలో దర్శకుడు కొరటాల శివ.. చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. సినిమా కంటెంట్ విషయంలో ఎలాగూ ఇలాంటి తప్పవు. కానీ కొరటాల చేసిన ఇంకో మిస్టేక్ ఏంటి అంటే..’ఆచార్య’ థియేట్రికల్ బిజినెస్ ని నెత్తిన వేసుకున్నాడు.

Devara

‘ఆచార్య’ భారీ నష్టాలు మిగల్చడం వల్ల.. అవన్నీ కొరటాల తీర్చాల్సి వచ్చింది. ఆ సినిమాకు గాను తీసుకున్న పారితోషికం వెనక్కి ఇవ్వడంతో పాటు కొంత ప్రోపర్టీ కూడా అమ్మి జీఎస్టీలతో సహా క్లియర్ చేయాల్సి వచ్చింది. ఇక ‘ఆచార్య’ దెబ్బ వల్లనో ఏమో కానీ.. ‘దేవర’ (Devara) బిజినెస్ కి కొరటాల శివ దూరంగా ఉన్నాడని ఇన్సైడ్ టాక్. మిక్కిలినేని సుధాకర్ తో పాటు కళ్యాణ్ రామ్ కూడా ఈ చిత్రానికి ఓ నిర్మాతగా వ్యవహరించాడు.

ఈ క్రమంలో ‘దేవర’ (Devara) డిస్ట్రిబ్యూషన్ అంతా వాళ్ళే హ్యాండిల్ చేశారట. ‘బింబిసార’ నిర్మాతల్లో ఒకరైన హరికృష్ణ, ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ అధినేత నాగవంశీ కలిసి ‘దేవర’ ని తెలుగు రాష్ట్రాల్లో డిస్ట్రిబ్యూట్ చేసినట్లు సమాచారం.’దేవర’ విషయంలో దర్శకుడు కొరటాల శివ.. కంప్లీట్ గా క్రియేటివ్ సైడే ఉన్నట్టు స్పష్టమవుతుంది.మరికొన్ని గంటల్లో ‘దేవర’ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మిడ్ నైట్ షోలకి ఫ్యాన్స్ అంతా రెడీగా ఉన్నారు. ఏమాత్రం పాజిటివ్ టాక్ వచ్చినా.. ఈ చిత్రం భారీ వసూళ్లు సాధించడం ఖాయంగా కనిపిస్తుంది.

యోగి ఆదిత్యనాథ్ తర్వాత పవన్ మాత్రమే.. కృష్ణవంశీ ఆసక్తికర వ్యాఖ్యలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus