Ram Charan: న్యూజిలాండ్ షెడ్యూల్ కోసం చరణ్ వర్కౌట్స్ వీడియో వైరల్..!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సిల్వర్ స్క్రీన్ సెల్యులాయిడ్ శంకర్ కాంబినేషన్‌లో.. దిల్ రాజు నిర్మిస్తున్న పాన్ ఇండియా మూవీ RC 15.. గతకొద్ది రోజులుగా కేవల సాంగ్స్, సెట్స్‌ అండ్ ఫైట్స్‌కే కోట్లాది రూపాయల భారీ బడ్జెట్ కేటాయించారు.. షూటింగ్ ఇంకా చాలా బ్యాలెన్స్ ఉంది. ట్రిపులార్ ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన చరణ్ అటునుండి అటు వెకేషన్‌కి వెళ్లాడు.. చెర్రీ తిరిగొచ్చాక కానీ కొత్త షెడ్యూల్ ఏంటనే అప్‌డేట్ తెలియదు..

సినిమా ఇంకా ఆలస్యమైన ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి.. కట్ చేస్తే.. ఎట్టకేలకు RC 15 యూనిట్‌లో మూమెంట్ వచ్చింది.. న్యూ షెడ్యూల్ కోసం న్యూజిలాండ్ వెళ్లింది టీం.. అక్కడ బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో సాలిడ్ యాక్షన్ సీన్స్ ప్లాన్ చేశారు శంకర్.. నూజిలాండ్‌లో ల్యాండ్ అవగానే రంగంలోకి దిగిపోయాడు రామ్ చరణ్. లోకల్ ట్రైనర్ సాయంతో గ్యాప్ లేకుండా సీరియస్ వర్కౌట్స్ స్టార్ట్ చేసేశాడు..సినిమా సినిమాకీ చరణ్ ఎంతలా కష్టపడతాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

తన 15వ చిత్రానికీ కూడా కఠినమైన కసరత్తులు చేస్తున్నాడు. ఎండలో చెర్రీ వర్కౌట్స్ చేస్తున్న వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.. ట్రిపులార్ తర్వాత పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన గుర్తింపుని.. శంకర్ సినిమాతో మరింత పెరుగుతుందంటూ కామెంట్స్ చేస్తున్నారు మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్.. అన్ని సామాజిక మాధ్యమాల్లోనూ చరణ్ వర్కౌట్ వీడియోను షేర్ చేస్తున్నారు..

అంజలి, కియారా అద్వానీ, శ్రీకాంత్, సునీల్, నాజర్, ఎస్.జె.సూర్య, నవీన్ చంద్ర, సముద్ర ఖని లాంటి హెవీ స్టార్ కాస్టింగ్‌ అండ్ భారీ బడ్జెట్‌తో ప్రెస్టీజియస్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద భారీ అంచనాలున్నాయి.. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతమందిస్తుండగా.. శంకర్ శిష్యుడు, దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ కథ, సాయి మాధవ్ బుర్రా మాటలు రాస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నారు.

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus