RC16: ఆ స్టార్ తోనే చరణ్ కుస్తీ ఫైట్!

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) తన కొత్త సినిమా RC16 (RC 16 Movie)  కోసం ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్‌కి గట్టిగా కష్టపడుతున్న విషయం తెలిసిందే. బుచ్చిబాబు సానా (Buchi Babu Sana)  దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చరణ్ పవర్‌ఫుల్ రోల్ లో కనిపించబోతున్నారు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌‍లో సాగే ఈ సినిమాలో కుస్తీ ఫైట్ ఒక కీలక హైలైట్‌గా నిలవనుంది. తాజాగా ఈ సీక్వెన్స్‌కు సంబంధించిన ఆసక్తికరమైన అప్‌డేట్ బయటకు వచ్చింది. ఈ వారం నుంచి RC16 షూటింగ్ నేరుగా ఢిల్లీలో జరగనుంది.

RC16

ఇప్పటికే హైదరాబాద్ షెడ్యూల్ కంప్లీట్ చేసిన టీమ్, ఇప్పుడు ఢిల్లీలోని కొన్ని ముఖ్యమైన లొకేషన్స్‌లో కీలక సన్నివేశాలను ప్లాన్ చేసింది. ఈ షెడ్యూల్‌లో రామ్ చరణ్ మీద ప్రత్యేకంగా కుస్తీ ఫైట్ సీన్స్‌ను షూట్ చేయనున్నారు. అయితే ఇందులో అతడికి పోటీగా ఎవరుంటారు? అనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం, ఈ భారీ యాక్షన్ సీక్వెన్స్‌లో చరణ్‌కి ఎదురుగా కన్నడ స్టార్ హీరో శివ రాజ్ కుమార్ (Shiva Rajkumar),నిలవబోతారని తెలుస్తోంది.

ఇప్పటికే ఆయన RC16లో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ ఉంది. అయితే ఇటీవలే శివ రాజ్ కుమార్ క్యాన్సర్ సంబంధిత చికిత్స కోసం విదేశాలకు వెళ్లి, కొద్దిరోజుల క్రితం బెంగళూరుకు తిరిగి వచ్చారు. ఆయన పూర్తిగా కోలుకున్న తర్వాతే షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది. ఈ ఢిల్లీ షెడ్యూల్ అనంతరం టీమ్ నేరుగా కాకినాడకు వెళ్లనుంది. అక్కడ ఉప్పాడ బీచ్‌లో కొన్ని కీలక సన్నివేశాలను ప్లాన్ చేశారు. ప్రత్యేకంగా ఈ కుస్తీ సన్నివేశాలకు సంబంధించిన కొన్ని పార్ట్‌లు అక్కడ ప్లాన్ చేసినట్లు సమాచారం.

కాకినాడ షెడ్యూల్‌లో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)   కూడా పాల్గొననుందని, ఆమె పాత్రకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సీన్లు అక్కడ చిత్రీకరించనున్నారని సమాచారం. మొత్తంగా చూస్తే RC16 షూటింగ్ వేగంగా పూర్తవుతోంది. 2026లో గ్రాండ్‌గా విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. బుచ్చిబాబు తనదైన ఇంటెన్స్ టేకింగ్‌తో ఈ సినిమాను రూపొందిస్తుండడంతో అంచనాలు పెరిగాయి. ఇక రామ్ చరణ్, శివ రాజ్ కుమార్ కుస్తీ ఫైట్ ఎలా ఉంటుందో చూడాలి.

జెనరేటర్ లో చక్కెర.. విష్ణు ఏం చెప్పాడంటే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus