మెగాస్టార్ చిరంజీవి కొడుకుగా సినీ పరిశ్రమకు పరిచయమైనప్పటికీ.. తన ఫిలాంత్రోఫిక్ యాక్టివిటీస్ మరియు మెచ్యూర్డ్ నడవడిక ద్వారానే ఈరోజున ఇంత పెద్ద స్టార్ అయ్యాడు రాంచరణ్. అతను ఫాలో అయ్యే ఉన్నత విలువల కారణంగానే అతనికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉన్నారని చెప్పడంలో కూడా ఎటువంటి సందేహం లేదు. అతని సినిమాలు ఎలా ఉన్నా..రికార్డు ఓపెనింగ్స్ నమోదవుతూ ఉంటాయి.. దానికి కారణం అతని డౌన్- టు-ఎర్త్ మనస్తత్వం వల్లనే అని చెప్పాలి. ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘ఆర్.ఆర్.ఆర్’ మూవీలో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు రాంచరణ్. ఎన్టీఆర్ మరో హీరోగా నటిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 13న విడుదల కాబోతుంది.
ఇది పక్కన పెట్టేస్తే.. మన రాంచరణ్ ని స్టైల్ ఐకాన్ అని కూడా చెప్పొచ్చు. అతను వేసుకునే డ్రెస్ లు షూస్ అంత స్టయిలిష్ గా ఉంటాయి. చరణ్ ఏ సినిమా వేడుకకు హాజరైనా అతని డ్రెస్సింగ్ స్టైల్ ఆకట్టుకుంటూనే ఉంటుంది. అయితే అతనికి వాచ్ లు అంటే చాలా ఇష్టం అన్న సంగతి బహుశా ఎక్కువ మందికి తెలిసి ఉన్నాడు. అతను షాపింగ్ చేస్తే ఎక్కువగా వాచ్ లనే కొనుగోలు చేస్తూ ఉంటాడట. ఇప్పటి వరకూ చరణ్ దగ్గర 8 ఖరీదైన వాచ్ లు ఉన్నాయట. ఆ వాచ్ లు ఏంటో.. వాటి ధరలు ఎంతో ఓ లుక్కేద్దాం రండి :
1) పాటిక్ ఫిలిప్పి నాటిలస్ క్రోనోగ్రాఫ్ : రూ.68 లక్షలు మొత్తం టాక్స్ లు, ఇంపోర్టింగ్ ధరలు అన్నీ కలిపుకుని ఏకంగా 1కోటి పైనే ఉంటుందట.
2) హుబ్లాట్ కింగ్ పవర్ లిమిటెడ్ ఎడిషన్ : రూ.18 లక్షలు
3) రిచార్డ్ మిల్లె ఆర్.ఎం.029 : రూ.85 లక్షలు కానీ టాక్సులు వంటి చార్జీలు కలుపుకుని ఇది కూడా ఏకంగా రూ1.5 కోట్ల వరకూ ఉంటుందట.
4) ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ గ్రాండ్ ప్రిక్స్ : రూ.75 లక్షలు కానీ అన్ని ఛార్జ్ లు కలుపుకుని ఇది కూడా ఫైనల్ కోటి పైనే ఉంటుందట.
5) ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ లెబ్రాన్ జేమ్స్ : రూ.43 లక్షలు
6) ఆడమర్స్ పైగట్ రాయల్ ఓక్ ఆఫ్ షోర్ నేవి బ్లూ : రూ.22 లక్షలు
7) రోలెక్స్ యాక్ట్ మాస్టర్- 2 : రూ.13 లక్షలు
Most Recommended Video
వైల్డ్ డాగ్ సినిమా రివ్యూ & రేటింగ్!
సుల్తాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 10 మంది హీరోయిన్లు టీనేజ్లోనే ఎంట్రీ ఇచ్చేసారు తెలుసా..!