చెర్రీ కథ మారిపోయింది!

‘త‌ని ఒవ‌రువ‌న్’ రీమేక్ తరువాత సుకుమార్‌తో కలిసి ఓ సినిమా చేయ‌బోతున్నాడు రామ్‌చ‌ర‌ణ్‌. క‌థ ఇప్ప‌టికే లాక్ అయిపోయిన‌ట్టు టాక్‌. ‘ఫార్ములా ఎక్స్’ అనే పేరు ఖ‌రారైపోయింద‌ని చెప్పుకొన్నారు. ఇదో సైన్స్ ఫిక్ష‌న్ సినిమా అని, చ‌ర‌ణ్ డాక్ట‌ర్‌గా క‌నిపించ‌బోతున్నాడ‌నే మాటలు వినిపించాయి. అయితే అందులో నిజం లేదని తేలింది.

ఈ సినిమాలో ఎలాంటి సైన్స్ ఫిక్ష‌న్లూ లేవ‌ట‌. చ‌ర‌ణ్ డాక్ట‌ర్ కాద‌ట‌. అస‌లు ఇది ఆ టైపు కథే కాద‌ట‌. గ్రామీణ నేప‌థ్యంలో సాగే వినూత్న ప్రేమ‌క‌థా చిత్ర‌మని తెలిసింది. అలాంటి క‌థ‌కు ఫార్ములా ఎక్స్ అనే పేరు ఎలా సూట‌వుతుంది? అందుకే టైటిల్ కూడా అది కాద‌న్న‌మాట‌. చ‌ర‌ణ్ కోసం ఫార్ములా ఎక్స్ అనే క‌థ సిద్ధం చేసిన మాట వాస్త‌వ‌మే.

అయితే ఇప్పుడు ఆ క‌థ‌ని ప‌క్క‌న పెట్టేసి చ‌ర‌ణ్ కోసం కొత్త క‌థ రాశాడు. ఈసారి ప్రేమ‌క‌థా చిత్రం తీయ‌బోతున్నాడని అంటున్నారు. మ‌రి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియలాంటే ఇంకొంత సమయం ఎదురు చూడాల్సిందే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus