RGV, KCR: కేసీఆర్ బయోపిక్ చిత్రంలో అలా మాత్రం చూపించను: వర్మ

రాంగోపాల్ వర్మ ఈ పేరు గురించి తెలియని వాళ్లు ఉండరు. ఒకప్పుడు టాలీవుడ్ టూ బాలీవుడ్ ఇండస్ట్రీలలో అగ్ర దర్శకుడిగా ఉన్నటువంటి వర్మ ప్రస్తుతం వివాదాల ద్వారా బాగా ఫేమస్ అవుతున్నారు. నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యలు లేదా ట్వీట్ల ద్వారా వర్మ వార్తల్లో నిలుస్తున్నారు. ఇకపోతే వర్మ సినిమాలు కూడా అదే స్థాయిలో వివాదాలు చెలరేగేలా ఉంటాయి. ఒకప్పుడు ఎన్నో కమర్షియల్ హిట్ సినిమాలను తెరకెక్కించిన వర్మ ప్రస్తుతం రాజకీయ నాయకుల బయోపిక్ చిత్రాలు చేస్తూ సంచలనం సృష్టిస్తున్నాడు.

ఇప్పటికే రక్త చరిత్ర, కమ్మ రాజ్యంలో కడప రెడ్లు వంటి సినిమాల ద్వారా పెద్ద ఎత్తున వివాదంలో నిలిచిన వర్మ తాజాగా కొండా సురేఖ మురళి దంపతులు జీవిత కథ ఆధారంగా కొండా అనే సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి జనవరి 26వ తేదీ ఒక ట్రైలర్ విడుదల చేసి సినిమాపై భారీ అంచనాలను పెంచారు. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నుంచి రెండవ ట్రైలర్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కొండా సురేఖ మురళి దంపతుల జీవితంలో ఎన్నో గొప్ప సంఘటనలు ఉన్నాయని అయితే సినిమాలో కొన్ని మాత్రమే చూపించామని తెలిపారు. ఇక ఈ సినిమాని తమ తల్లిదండ్రుల జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తుడండతో సురేఖ దంపతుల కుమార్తె సుస్మిత ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇకపోతే వర్మ తప్పకుండా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్ చిత్రం చేస్తానని ఈ సందర్భంగా వెల్లడించారు.

అయితే తాను ఎవరి బయోపిక్ చిత్రం చేసిన ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చూపించని నిజాలు మాత్రమే చూపిస్తానని తెలిపారు.అయితే ఈ సినిమా ఎప్పుడు చేస్తాను అనే విషయం గురించి క్లారిటీ లేదని ఈ సందర్భంగా వర్మ కామెంట్ చేశారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!


విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!/a>
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus