రామ్ గోపాల్ వర్మ ఎవరికీ పరిచయం లేని పేరు. కాంట్రవర్సీ చేయాలన్న, ఒక డెబిట్ ని డీల్ చేయాలన్న వర్మకి సాటి లేరనే చెప్పవచ్చు. ఆయన మాటలు కొందరికి నచ్చితే మరికొందరికి కత్తుల్లా గుచ్చుకుంటాయి. అయితే రామ్ గోపాల్ వర్మ ఇటీవలే జరిగిన ‘భైరవగీత’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో యాంకర్ అవతారం ఎత్తి చాలా సందడి చేయడమే కాకుండా తనదైన శైలిలో సెటైర్లు కూడా వేసాడు. ఇలా వర్మ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో యాంకర్ గా చేస్తూ ఒక్కొక్కరిని స్టేజ్ పైకి పిలిపించి అందరిని చాలా నవ్వించాడు.
రామ్ గోపాల్ వర్మ మైక్ పట్టుకొని ‘భైరవగీత’ సినిమాలోని పాటలను కార్యక్రమానికి వచ్చిన ఒక్కో గెస్ట్ చేత ఒక్కో పాటను ఆవిష్కరింపజేశారు. అయితే ఇందులో భాగంగానే ఈ వేడుకకి అథితిగా వచ్చిన డైరెక్టర్ సుధీర్ వర్మ ని స్టేజ్ పైకి పిలిచే ముందు, నాకు చాలా కుల పిచ్చి అందుకే సుధీర్ వర్మ ని స్టేజ్ పైకి ఆహ్వానిస్తున్నాను అన్నాడు. అంతేకాకుండా మరొక పాటను రిలీజ్ చేసేందుకు RX 100 సినిమా డైరెక్టర్ అజయ్ భూపతిని పిలుస్తూ ‘ఆరెక్స్ 100 కాదు ఆర్డీఎక్స్ 100’ అంటూ ఇలా అందరి పైన తెగ పంచులు వేస్తూ ఈవెంట్ ని చాలా సందడిగా మార్చేశాడు.