మీటు ఉద్యమం గత కొద్దీ రోజులుగా అందరికి కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ ఉద్యయం తో సినీ ఇండస్ట్రీలో ఎవరిమీద ఎప్పుడు ఎలాంటి వార్తలు వస్తాయనేది అర్ధం కానీ పరిస్థితి. ఇది ఇలా ఉంటె, రామ్ గోపాల్ వర్మ నిర్మించిన ‘భైరవ గీత’ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. అయితే వర్మ మీడియా తో మాట్లాడుతూ, ఇది ఒక విభిన్న ప్రేమ కథ ప్రేక్షకులకి తప్పకుండ నచ్చుతుందనే నమ్మకం ఉందని చెప్పాడు. అందులో ఒక రిపోర్టర్ మీటు ఉద్యమం గురించి మీ అభిప్రాయం చెప్పండని అడుగగా వర్మ తనదైన శైలిలో నవ్వుతూ ఎవరు ఊహించని షాకింగ్ కామెంట్స్ చేసాడు.
ఇక విషయంలోకి వెళితే, మీటు ఉద్యమంలో అసలు నా పేరు ఇప్పటివరకు రాకపోవడం ఆశ్చర్యంగా ఉంది. నా పైన ఎప్పుడు ఏదో ఒక రూమర్ ఉంటుంది దాంతో మీటు లో నా పేరు కూడా వస్తుందని చాలా మంది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసారు, కొందరు నాపేరు రావాలని కోరుకున్నారు కూడా కానీ నాపేరు తప్ప అందరి పేర్లు రావడం నాకు విచిత్రంగా అనిపిస్తుందని వర్మ తనదైన స్టైల్లో చెప్పేసేడు. ఇంకా అందులోనే ఒకరు మీటు ఉద్యమంలో ఆరోపణలు ఎదుర్కుంటున్న కొందరి పైన మీ అభిప్రాయం ఏంటని అడుగగా, వారి గురించి ఇప్పుడు మాట్లాడటం దేనికి అంటూ దాటివేశాడు.