శ్రీదేవి జీవితంపై సినిమా గురించి వర్మ ఏమన్నారంటే ?

అందం, అభినయంతో దేశవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి హఠాన్మరణం అందరినీ విషాదంలో ముంచివేసింది. ఆమె ఇక లేరని తెలిసిన తర్వాత విలవిలాడిన వారిలో కుటుంబసభ్యులు, అభిమానులతో పాటు ప్రముఖ డైరక్టర్ రావ్ గోపాల్ వర్మ కూడా ఉన్నారు. శ్రీదేవి మరణ వార్త విని వర్మ రాసిన లేఖ కూడా చాలామందిని కదిలించింది. దేశంలో ప్రాచుర్యం పొందిన వ్యక్తుల జీవితాలను వెండితెరకెక్కించడంలో దిట్ట అయిన వర్మ తన అభిమాన తార బయోపిక్ ని కూడా రూపొందిస్తారని అందరూ అనుకున్నారు. ఇదే విషయాన్నీ అతని ముందు ఉంచగా.. ఇలా స్పందించారు.

“శ్రీదేవి బయోపిక్‌ తీస్తున్నాన్నంటూ కొన్ని మీడియా వర్గాలు రాస్తున్న కథనాలు అవాస్తవం. ఆ ప్రయత్నం అవివేకం. ఎందుకంటే శ్రీదేవిలా ఆ పాత్రను పోషించగల నటి ఒక్కరూ లేరు” అని వర్మ ట్వీట్‌ చేశారు. ఈ ఒక్క ట్వీట్ తో రూమర్లకు చెక్ పెట్టడంతో పాటు.. శ్రీదేవి గొప్పదనాన్ని, తన అభిమానాన్ని చాటుకున్నారు. ప్రస్తుతం వర్మ.. అక్కినేని నాగార్జునతో “ఆఫీసర్‌” అనే సినిమాని తెరకెక్కిస్తున్నారు. అలనాటి బ్లాక్ బస్టర్ హిట్ శివ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus