మహేష్ బాబు ‘ఏఎంబీ’ సినిమాస్ మల్టీప్లెక్స్ పై కామెంట్స్ చేసిన వర్మ!

రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియా లో ఎప్పుడు యాక్టీవ్ గా ఉంటూ తనకు అనిపించింది నిర్మొహమాటంగా చెప్పేస్తూ పోస్టులు పెడుతుంటాడు. అందులో ఎక్కువశాతం అందరిని తనదైన శైలిలో విమర్శిస్తుంటాడు. అయితే హీరో మహేష్ బాబు ఏషియన్ సంస్థ తో కలసి నిర్మించిన ‘ఏఎంబీ’ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ నిర్మాణ పనులు అన్ని పూర్తి చేసుకుంది. హీరో మహేష్ భాగస్వామిగా ఉన్న ఈ మల్టిప్లెక్స్ సందర్శించిన వర్మ మహేష్ ని ఉద్దేశిస్తూ కామెంట్స్ చేసాడు.

అయితే ‘ఏఎంబీ’ సినిమాస్ మల్టీప్లెక్స్ థియేటర్స్ ని చూసాను, ఒక్కో థియేటర్ ని చూస్తుంటే మైండ్ బ్లాంక్ అయిపోయింది, అసలు థియేటర్ లోపల వాతావరణం చూస్తుంటే మాటలు రాలేదు, ఒక్క మాటలో చెప్పాలంటే మహేష్ బాబు ఎంత అందంగా ఉంటాడో ఈ మల్టీప్లెక్స్ థియేటర్స్ కూడా అంతే బ్యూటీఫుల్‌గా ఉందంటూ’ ట్వీట్ చేసాడు. అత్యాధునిక హంగులతో విదేశీ టెక్నాలజీ ని ఉపయోగించి నిర్మించిన ఈ మల్టిప్లెక్స్ లో మొత్తం 7 స్క్రీన్ లు ఉండగా మొత్తం సిటింగ్ కెపాసిటీ 1600 ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ప్రారంభోత్సవం ఆలస్యమైనా ఈ మల్టిప్లెక్స్ రేపు హీరో రజినీకాంత్ చేతులమీదుగా ప్రారంభించనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus