ఆఫీసర్ సినిమా గురించి వచ్చిన వార్తలను ఖండించిన వర్మ

  • April 3, 2018 / 11:09 AM IST

ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్వకత్వంలో చాలాకాలం తర్వాత నాగార్జున ఆఫీసర్ అనే మూవీ చేశారు. షూటింగ్ పూర్తిచేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ మే 25 వ తేదీన రిలీజ్ కానుంది. ఇందులో నాగ్ పోలీస్ ఆఫీసర్ గా నటించారు. వర్మ స్వయంగా నిర్మిస్తున్న ఈ చిత్రంపై కొన్ని రోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతోంది . ఈ చిత్ర కథ ఫ్రెంచ్ యాక్షన్ థ్రిల్లర్ ‘టేకెన్’ చిత్రానికి కాపీ అని సోషల్ మీడియాలో నెటిజనులు చెబుతున్నారు. దీనిపై వర్మ స్పందించారు.

ఆఫీసర్ కథ తాను సొంతంగా రాసుకున్నదని వివరించారు. “ఆఫీసర్ లో నాగార్జున పోలీస్ కావడం, అతనికో కుమార్తె ఉండటం వంటి అంశాలు “టేకెన్” లోను ఉంటాయి. అవి తప్ప మిగతా విషయాల్లో ‘టేకెన్’కు దీనికి అస్సలు పోలిక ఉండదు” అని స్పష్టం చేశారు. ఈ చిత్రం తర్వాత నాగ్ శ్రీరామ్ ఆదిత్య డైరెక్ష‌న్‌లో నటించనున్నారు. నాని తో కలిసి మల్టీ స్టారర్ మూవీ చేయనున్నారు. ఇక వర్మ మాత్రం ఆఫీసర్ విడుదలయిన తర్వాత అఖిల్ కోసం మంచి స్క్రిప్ట్ రాసే పని మొదలు పెట్టనున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus