రేపు ఏపీ లో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్.. సాధ్యమేనా..?

‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రం ఒక్క ఏపీ లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాల్లో విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే రాంగోపాల్ వర్మ మెయిన్ టార్గెట్ మాత్రం ఏపీ నే..! ఈ చిత్రాన్ని ఏపీ ప్రజలకి చూపించి చంద్రబాబు.. తన మామగారు ఎన్టీఆర్ ని ఏ విధంగా వెన్నుపోటు పొడిచాడు అనేది ప్రచారం చేయాలనేది వర్మ ఆరాటం. దీంతో ఏపీలో ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని మే1(రేపు) విడుదల చేస్తున్నట్టు చిత్ర నిర్మాత రాకేశ్ రెడ్డి, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు.

అయితే ఎన్నికల సంఘం అనుమతి లేకుండానే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి వారు రెడీ అవుతుండడం గమనార్హం. ఈ క్రమంలో, సినిమా విడుదలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఇలాంటి చిత్రాలు విడుదల చేయవద్దని ఏప్రిల్ 10న ఈసీ ఆదేశాలను జారీ చేసింది. ఎన్నికల పై ప్రభావం చూపే బయోపిక్ లను ప్రదర్శించరాదని ఈ ఆదేశాల్లో ఉంది. అయితే వారి ఆదేశాలను సవరిస్తూ ఈసీ మరో ఉత్తర్వును విడుదల చేయలేదు.ఇలాంటి పరిస్థితుల్లో.. అందులోనూ మే 23 వరకూ ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈ చిత్రాన్ని విడుదల చేయడం కుదరదు. మరి ఈ చిత్రం రేపు ఏపీలో విడుదలవుతుందా లేక మళ్ళీ వర్మ అందరినీ బకరాల్ని చేస్తాడా అనేది చూడాలి మరి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus