లవ్ అండ్ యాక్షన్ చిత్రాలతో హంగామా చేయనున్న రామ్

ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ నుంచి ఈ ఏడాది రెండు చిత్రాలు రానున్నాయి. ఉన్నది ఒకటే జిందగీ తర్వాత అతను ‘హలో గురు ప్రేమ కోసమే’ సినిమాను పట్టాలెక్కించారు. దిల్‌ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో రామ్‌ కు జోడిగా అనుపమా పరమేశ్వరన్‌ నటిస్తోంది. నాని హీరోగా నేనులోకల్‌ సినిమాతో మంచి సక్సెస్‌ సాధించిన త్రినాథ్‌ రావు నక్కిన ఈ సినిమాకు దర్శకుడు. ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ గత నెల ప్రారంభమైంది. . రొమాటింక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. ఈ సినిమా సెట్స్ పై ఉండగానే మరో చిత్రాన్ని ప్రారంభించారు.

గరుడ వేగా సినిమాతో హిట్ అందుకున్న ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని రామ్ బాబాయ్ స్రవంతి రవి కిషోర్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి రీసెంట్ గా చాలా సింపుల్ గా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా డైరక్టర్ మాట్లాడుతూ.. “ఇది యాక్షన్ సినిమా. స్క్రిప్ట్ అద్భుతంగా వచ్చింది. రామ్ కి బాగా యాప్ట్ అవుతుంది” అని అన్నారు. మే 7 వ తేదీ నుంచి జార్జియా లో తొలి షెడ్యూల్ మొదలు కానుంది. ఇందులో హీరోయిన్ గా “నేల టిక్కెట్టు” సినిమా ద్వారా పరిచయమవుతున్న మాళవికను పరిశీలిస్తున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus