ఎనర్జిటిక్ స్టార్ రామ్ తో.. అనిల్ రావిపూడి సినిమా..!

‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత రామ్ మార్కెట్ పెరిగింది అనేది వాస్తవం. ఇప్పుడు రామ్ సినిమాలకు 40కోట్ల వరకూ మార్కెట్ ఉంది. దాంతో ఈ ఎనర్జిటిక్ హీరోతో వర్క్ చెయ్యడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పటికే వినాయక్, త్రివిక్రమ్ వంటి దర్శకులు రామ్ తో సినిమాలు చెయ్యడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఈ లిస్ట్ లో ఎనర్జిటిక్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కూడా చేరినట్టు తాజా సమాచారం. అవును రామ్ తో దర్శకుడు అనిల్ రావిపూడి సినిమా చెయ్యాలని ప్రయత్నాలు మొదలుపెట్టాడట.

నిజానికి అనిల్ రైటర్ గా ఉన్నప్పటి నుండీ రామ్ కు మంచి ఫ్రెండ్.వీరి కాంబినేషన్లో ‘రాజా ది గ్రేట్’ రావాల్సి ఉంది. కానీ కొన్ని కారణాల వల్ల రామ్ ఆ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు. రామ్ నటించిన సూపర్ హిట్ మూవీ ‘కందిరీగ’ కు కూడా అనిల్ రావిపూడి రైటర్ గా పనిచేసాడు. ఇదిలా ఉండగా రామ్.. ఇప్పుడు తన మార్కెట్ ను కాపాడుకోవాలి అంటే అనిల్ రావిపూడి వంటి క్రేజీ డైరెక్టర్లతో సినిమాలు చెయ్యడమే కరెక్ట్.! అతను కూడా ఇదే భావిస్తున్నాడని వినికిడి.

అందుకే ‘ఇస్మార్ట్ శంకర్’ వంటి మాస్ హిట్ తరువాత.. తనకు ‘నేను శైలజ’ వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కిశోర్ తిరుమలతో ‘రెడ్’ అనే థ్రిల్లింగ్ సినిమా చేసాడు. సంక్రాంతికి విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అనిపించుకుంది. 5 రోజుల్లోనే ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాధించడం విశేషం. ఇప్పుడు అనిల్ రావిపూడి తో కనుక సినిమా చేస్తే.. కచ్చితంగా రామ్ ఇమేజ్ మరింత పెరిగే అవకాశం ఉంటుంది అని చెప్పడంలో సందేహం లేదు. 2021 క్లయిమాక్స్ లో వీరి కాంబోలో ప్రాజెక్టు మొదలవుతుందనే టాక్ వినిపిస్తుంది. చూడాలి మరి.. ఆ వార్తలో ఎంత వరకూ నిజముందో..!

Most Recommended Video

మాస్టర్ సినిమా రివ్యూ& రేటింగ్!
రెడ్ సినిమా రివ్యూ & రేటింగ్!
క్రాక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus