సాటిస్ఫై చేయలేకపోయినా సపోర్ట్ చేసి మరీ హిట్ చేశారు

  • November 19, 2018 / 06:13 AM IST

ఈమధ్యకాలంలో ఫ్లాపైన సినిమాల్నే “సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ హిట్, పీపుల్ బ్లాక్ బస్టర్” అంటూ హడావుడి చేస్తూ పబ్లిసిటీ చేసుకొంటున్నారు దర్శకనిర్మాతలు, కథానాయకులు. చాలా తక్కువ మంది కథానాయకులు మాత్రమే తమ పరాజయాల్ని ఒప్పుకొంటుంటారు అది కూడా తమ తదుపరి సినిమా ప్రమోషన్స్ లో మాత్రమే. కానీ.. ఎనర్జీటిక్ స్టార్ రామ్ మాత్రం ఇందుకు మినహాయింపుగా నిలిచాడు. ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన “హలో గురు ప్రేమ కోసమే” చిత్రాన్ని దిల్ రాజు నిర్మించగా.. “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కిన దర్శకత్వం వహించారు. దసరా కానుకగా విడుదలైన ఆ చిత్రం జనాలకి పెద్దగా ఎక్కలేదు. చాలా తక్కువ మంది జనాలు ఆ చిత్రాన్ని ఎంజాయ్ చేయగలిగారు.

అందుకు కారణం రిపీటెడ్ స్టోరీ మరియు సెంటిమెంట్స్. ప్రకాష్ రాజ్-రామ్ ల కెమిస్ట్రీ బాగున్నప్పటికీ.. ప్రెజంట్ జనరేషన్ సినిమాలతో ఆ కెమిస్ట్రీ పోటీ పడలేక చతికిలపడింది. అయినప్పటికీ.. ఎప్పట్లానే సినిమా సూపర్ హిట్ అని ప్రమోట్ చేయడం మొదలెట్టారు. కానీ.. ఇటీవల “హలో గురు ప్రేమకోసమే” క్లోజింగ్ బిజినెస్ పై స్పందించిన రామ్ “అంతగా సాటిస్ఫై చేయలేకపోయినా.. హిట్ చేశారు” అంటూ ట్వీట్ చేశాడు. దాంతో అప్పటివరకూ.. సినిమా సూపర్ హిట్ అని ఎగిరినవాళ్ళు కూడా సైలెంట్ అయిపోయారు. అయితే.. తన తదుపరి చిత్రంతో పూర్తిస్థాయిలో అలరిస్తాను అని రామ్ ప్రామిస్ చేయడంతో రామ్ ఫ్యాన్స్ అందరూ ఖుష్ అయిపోయారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus