ఇండస్ట్రీలో టాప్ లిరిసిస్ట్ లలో రామజోగయ్య శాస్త్రి కూడా ఒకరు. ఎన్నో ఉత్సాహభరితమైన పాటలతో పాటు ఉల్లాసభరితమైన పాటలను అలాగే.. ఆలోచింపజేసే సందేశాత్మక పాటలను కూడా రాసి మనల్ని అలరించారు రాంజో. సోషల్ మీడియాలోనే కాకుండా ఇండస్ట్రీలో కూడా ఈయన్ని రాంజో అంటుంటారు. ఇక ఈయన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని టాలీవుడ్ ఇండస్ట్రీ పై షాకింగ్ కామెంట్స్ చేసాడు. ఈయన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి.
రామజోగయ్య శాస్త్రి మాట్లాడుతూ.. “చిత్రపరిశ్రమలో లిరిక్ రైటర్స్ కి ఇవ్వాల్సినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదు. వాళ్ళకి రావలసినంత గుర్తింపు అస్సలు రావడం లేదు. ఇండస్ట్రీ నుంచే కాదు .. అటు పబ్లిక్ నుంచి కూడా మా శ్రమకి తగిన గుర్తింపు రావడం లేదని నేను గ్రహించాను. ఆడియో ఫంక్షన్ లిరిక్ రైటర్స్ కి సంబంధించినదే కానీ… అక్కడ మా పాత్ర అంతగా ఉండడం లేదని నాకు అర్థమైంది. నన్ను గౌరవించడండి అని అడగడంకన్నా .. మన పనిని జనంలోకి తీసుకెళితే ఆ పనే కావాల్సినంత గౌరవాన్ని తీసుకొస్తుంది. అందుకే నేను రాసిన పాటలను సోషల్ మీడియాలో పెడుతుంటాను. అందులోని సాహిత్యాన్ని గురించిన విషయాలను పంచుకుంటాను” అంటూ చెప్పుకొచ్చాడు.
అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!