మాస్ మహారాజ్ రవితేజ హీరోగా వచ్చిన రీసెంట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’.శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకుడు కాగా ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. దివ్యాంశ కౌశిక్, రెజిషా విజయన్ లు హీరోయిన్లు. ‘ఖైదీ'(2019) ఫేమ్ సామ్ సి ఎస్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. 9 ఏళ్ళ తర్వాత సీనియర్ హీరో వేణు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చాడు.
టీజర్, ట్రైలర్ లకు సూపర్ రెస్పాన్స్ లభించింది. కానీ జూలై 29న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ నెగిటివ్ టాక్ ను మూటకట్టుకోవడంతో బాక్సాఫీస్ వద్ద పెద్ద డిజాస్టర్ గా మిగిలింది.ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :
నైజాం
1.40 cr
సీడెడ్
0.74 cr
ఉత్తరాంధ్ర
0.65 cr
ఈస్ట్
0.43 cr
వెస్ట్
0.22 cr
గుంటూరు
0.36 cr
కృష్ణా
0.34 cr
నెల్లూరు
0.17 cr
ఏపీ + తెలంగాణ (టోటల్)
4.31 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ ఓవర్సీస్(తెలుగు వెర్షన్)
0.88 cr
వరల్డ్ వైడ్ టోటల్
5.19 cr
‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రానికి రూ.17.72 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి. ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం కేవలం రూ.5.19 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. ఫుల్ రన్లో బయ్యర్లకు ఈ చిత్రం బిజినెస్ పై రూ.12.53 కోట్ల నష్టాలను మిగిల్చింది.
మొదటి వీకెండ్ కే దుకాణం సర్ధేసిన ఈ మూవీ వీక్ డేస్ కనీసం నిలబడలేకపోయింది. దీంతో ఫైనల్ గా ఈ చిత్రం ట్రిపుల్ డిజాస్టర్ గా మిగిలింది అని చెప్పాలి.