Ramarao On Duty OTT: ఓటీటీలో రామారావు సందడి చేసేది అప్పుడే?

ప్రస్తుతం కొన్ని కోట్ల రూపాయల బడ్జెట్ తో తెరకెక్కిన సినిమాలు థియేటర్ రన్ పూర్తి చేసుకున్న అనంతరం తప్పనిసరిగా డిజిటల్ మీడియాలో ప్రేక్షకులను సందడి చేస్తున్నాయి. అయితే థియేటర్లో కన్నా డిజిటల్ మీడియాలోనే సినిమాలను చూసే వారి సంఖ్య రోజురోజుకు అధికమవుతుంది. ఈ క్రమంలోనే సినిమాలను థియేటర్లో విడుదలైన తర్వాత వెంటనే ఓటీటీలో విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయం తీసుకున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా మాస్ మహారాజ రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో వచ్చిన చిత్రం రామారావు ఆన్ డ్యూటీ.

ఈ సినిమా ఈ నెల 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చి విడుదలైన మొదటి షో నుంచి మిశ్రమ టాక్ సొంతం చేసుకుంది. ఇక ఈ సినిమా థియేటర్లో విడుదల కాగానే ఈ సినిమాకి ఫ్యాన్సీ డీల్ ఆఫర్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇక ఈ సినిమా డిజిటల్ రైట్స్ భారీ ధరలకు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లైవ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన పోస్టర్ కూడా విడుదల చేశారు.

ఇకపోతే ఈ సినిమా డిజిటల్ రైట్స్ దక్కించుకున్న సోనీ లైవ్ ఈ సినిమా థియేటర్ 8 వారాలకు డిజిటల్ మీడియాలో స్ట్రీమింగ్ కానుందని తెలుస్తోంది.సాధారణంగా సినిమా విడుదలైన నాలుగు వారాలు లేదా ఆరు వారాలకు ప్రతి ఒక్క సినిమా డిజిటల్ మీడియాలో ప్రసారమయ్యేవి.

ఇలా తొందరగా సినిమాలను డిజిటల్ స్క్రీన్ లో విడుదల చేయటం వల్ల థియేటర్ కు వచ్చే వారి సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో నిర్మాతలు ఇలాంటి నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే రవితేజ ఈ సినిమాలో ఒక పవర్ ఫుల్ నిజాయితీ గల ఎమ్మార్వో ఆఫీసర్ పాత్రలో నటించారు. ఈ సినిమాలో రవితేజ సరసన మజిలీ ఫేమ్ దివ్యాంశ కౌశిక్, రజిషా విజయన్ హీరోయిన్లు నటించారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus