Ramarao On Duty Twitter Review: యావరేజ్ టాక్ వస్తుంది.. పర్వాలేదంటున్నారు కానీ..!

మాస్ మహారాజ్ రవితేజ హీరోగా రూపొందిన లేటెస్ట్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’. ‘ఎస్.ఎల్.వి సినిమాస్’ ‘ఆర్.టి.టీం వర్క్స్’ పతాకం పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. దివ్యాంశ కౌశిక్, రెజిషా విజయన్ లు హీరోయిన్లుగా నటించారు. ‘ఖైదీ'(2019) ఫేమ్ సామ్ సి ఎస్ సంగీతం అందించారు. పాటలు ఎలా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం ఇతను ఇరక్కొట్టేసాడు అని ఇన్సైడ్ టాక్. 9 ఏళ్ళ తర్వాత సీనియర్ హీరో వేణు ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

టీజర్, ట్రైలర్ లకు మంచి రెస్పాన్స్ లభించింది. ఇదిలా ఉండగా… ఓవర్సీస్ లో ఆల్రెడీ ప్రీమియర్స్ పడిపోయాయి. సినిమా చూసిన కొంతమంది ప్రేక్షకులు ట్విట్టర్ ద్వారా తమ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. వాటి టాక్ ప్రకారం సినిమా ఫస్ట్ హాఫ్ బాగుందట. మాస్ ఆడియన్స్ కు నచ్చే ఎలిమెంట్స్ ఫస్ట్ హాఫ్ లో ఉన్నాయని.. ఇంటర్వెల్ వద్ద ట్విస్ట్ సెకండ్ హాఫ్ పై ఆసక్తి రేకెత్తించేలా ఉంది అని చెబుతున్నారు.

సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ ఉందని, సినిమా సబ్జెక్ట్ కొత్తగా ఉన్నప్పటికీ రొటీన్ కథనంతో వీక్ గా సాగింది అంటూ ఓవర్సీస్ ప్రేక్షకులు అంటున్నారు. క్లైమాక్స్ కూడా అంతంత మాత్రంగానే ఉందని వారు చెబుతున్నారు. అయితే సామ్ సి ఎస్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, రవితేజ పెర్ఫార్మన్స్ సినిమాకి హైలెట్ గా నిలిచాయని, యాక్షన్ సన్నివేశాలు కూడా బాగున్నాయని ఓవర్సీస్ ప్రేక్షకులు ట్విట్టర్లో చెప్పుకొస్తున్నారు.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus