కంటెంట్ బాగుంటే విలన్ గాను నటిస్తా : రాంకీ

అభిమానులను ఏర్పరుచుకోవడానికి ఒక సినిమా చాలు అని సింధూరపువ్వు నిరూపించింది. 1987 లో తమిళంలో రూపుదిద్దుకున్న ఈ మూవీ.. అనువాదమై ఇక్కడ కూడా రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఇందులో హీరోగా నటించిన రాంకీ కి చాలా మంది అభిమానులు అయిపోయారు. అయితే ఆ తర్వాత రాంకీ కోలీవుడ్ కే పరిమితమయ్యారు. ఒసేయ్ రాములమ్మ సినిమాలో రీ ఎంట్రీ ఇచ్చి చప్పట్లు అందుకున్నారు. తాజాగా దర్శకుడు రాంగోపాల్ వర్మ శిష్యుడు అజయ్ భూపతి‌ దర్శకత్వం వహించిన “ఆర్‌ఎక్స్ 100” చిత్రంలో మంచి రోల్ పోషించారు. అశోక్‌రెడ్డి గుమ్మకొండ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12వ తేదీన రిలీజ్ కానుంది.

ఈ సందర్భంగా రాంకీ మాట్లాడుతూ.. “ఆర్‌ఎక్స్ 100 సినిమాలోని ఒక కీలకమైన పాత్రను నేను చేస్తేనే బాగుంటుందని దర్శక నిర్మాతలు అనుకున్నారు. నా కోసం చెన్నై వచ్చి నా పాత్ర గురించి చెప్పారు. కొత్తగా అనిపించడంతో ఆలోచించకుండా అంగీకరించాను. ఈ సినిమాలో నేను హీరోకి తండ్రి పాత్రలో కనిపించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.. కానీ అందులో ఎంతమాత్రం నిజం లేదు.” అని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ” ఇక నుంచి క్యారక్టర్ ఆర్టిస్ట్ గా మాత్రమే కాదు.. కంటెంట్ ఉంటే విలన్ గాను చేయడానికి సిద్ధమే” అంటూ తన మనసులోని మాటను బయటపెట్టారు. హీరోగా చేసినవారు విలన్ గా బాగా రాణిస్తున్నారు. మరి రాంకీ ఏ మాత్రం అవకాశాలను అందుకుంటారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus