ప్రముఖ బిజినెస్ మెన్, ఈనాడు గ్రూప్ అధినేత, ప్రముఖ నిర్మాత అయిన రామోజీరావు కన్నుమూశారు. ఈ విషయం ఒక్కసారిగా అందరినీ షాక్ కి గురిచేసింది. శుక్రవారం రాత్రి ఆయన తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు, ఆయన అనుచరులు.. హుటాహుటిన నానక్ రామ్ గూడలోని స్టార్ హాస్పిటల్ లో చేర్పించారు. వెంటనే వైద్యపరీక్షలు నిర్వహించి ఆ తర్వాత స్టెంట్ వేశారట. హై బీపీ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో ఆయన తెల్లవారుజామున 4 గంటల 50 నిమిషాలకి మృతిచెందినట్టు తెలుస్తుంది.
ఆయన వయసు 88 ఏళ్ళు కావడం గమనార్హం. కృష్ణా జిల్లా పెదపారుపూడి గ్రామంలో రామోజీరావు జన్మించారు. 1936లో ఆయన ఓ సాధారణ రైతు కుటుంబంలో జన్మించడం జరిగింది. తన తెలివితేటలు, స్వయంకృషితోనే ఆయన పెద్ద ఇండస్ట్రియలిస్ట్ గా ఎదిగారు. ప్రపంచంలోనే అతి పెద్ద థీమ్ పార్క్ ఫిల్మ్ స్టూడియో ఆయన కట్టించడం. అలాగే ‘ఉషా కిరణ్ మూవీస్’ అనే బ్యానర్ పై ఎన్నో సీరియల్స్ అలాగే సినిమాలు నిర్మించారు. ఆయన నిర్మించిన సినిమాల్లో దాదాపు అన్నీ సక్సెస్ సాధించినవే అని చెప్పాలి.
తేజ వంటి ఎంతోమంది టాలెంటెడ్ దర్శకులను ఆయన టాలీవుడ్ కి పరిచయం చేశారు. అలాగే ‘నువ్వేకావాలి’ వంటి ఇండస్ట్రీ హిట్ సినిమా కూడా ఆయన బ్యానర్ నుండే వచ్చింది. రామోజీరావుకి ఇద్దరు కొడుకులు. ఒకరు చెరుకూరి సుమన్, ఇంకొకరు కిరణ్ ప్రభాకర్. వీరిలో సుమన్ కొన్నాళ్ల క్రితం అనారోగ్య సమస్యలతో మరణించడం జరిగింది.ఇక రామోజీరావు మృతి పట్ల పలువురు సినీ,రాజకీయ..ప్రముఖులు తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.