ఆ తమిళ సూపర్ హిట్ రీమేక్ లో రవితేజ-రాణా!

తమిళనాట ఇటీవల విడుదలై ఘన విజయం సొంతం చేసుకొన్న “విక్రమ్ వేద” చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయనున్నారన్న విషయం తెలిసిందే. తొలుత ఈ సినిమా తెలుగు రీమేక్ లో వెంకటేష్-రాణాలు నటించనున్నారనే వార్తలు వినిపించినప్పటికీ.. తాజా సమాచారం ప్రకారం తెలుగు రీమేక్ లో రవితేజ “వేద”గా నటించనున్నారని తెలుస్తోంది. సినిమాలో వేదాది పైకి నెగిటివ్ రోల్ లా కనిపించినా నిజానికి ఆ పాత్రది చాలా పాజిటివ్ రోల్. ఎనర్జీకి మారుపేరు లాంటి రవితేజ, యాక్షన్ అండ్ డిక్షన్ కు కేరాఫ్ అడ్రెస్ లాంటి రాణా కలిసి “విక్రమ్ వేదా” తెలుగు రీమేక్ లో నటిస్తుండడంతో తెలుగులో రాబోయే క్రేజీయస్ట్ ప్రోజెక్ట్ గా సినిమా నిలవనుంది.

ఈ కాంబినేషన్ కనుక నిజమే అయితే రవితేజ అభిమానులతోపాటు తెలుగు సినిమా అభిమానులకు కూడా ఈ ఇది శుభవార్తే. ఎందుకంటే “విక్రమ్ వేద” సబ్జెక్ట్ అలాంటిది. సస్పెన్స్ థ్రిల్లర్ అయిన ఈ చిత్రం వెండితెరపై మాత్రమే కాదు రీసెంట్ గా బుల్లితెరపై సృష్టించిన సునామీ అలాంటిది. సో, ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ కు ఎప్పుడు వెళ్తుందో.. ఎప్పటికీ థియేటర్లలో దర్శనమిస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus