కలిసి నడవనున్న రానా, తమన్నా
- March 31, 2017 / 07:48 AM ISTByFilmy Focus
బాహుబలి సినిమాలో భల్లాల దేవా గా రానా, అవంతికగా తమన్నా నటించారు. ఈ చిత్రంలో ఇద్దరికీ చంపుకునే అంత శత్రుత్వం ఉంది. బాహుబలి కంక్లూజన్ లో వీరిద్దరి మధ్య పోరాటం ఉంది. భల్లా సైన్యం పై అవంతిక చిరుతపులిలా విరుచుకుపడే పోరాట దృశ్యాలను మరో నెల రోజుల్లో వెండితెరపై చూడనున్నాం. రాజమౌళి తెరకెక్కించిన బహుబలి 2 ఏప్రిల్ 28 న రిలీజ్ కానుంది. అంతకంటే ముందు రానా, తమన్నాలను రియల్ లైఫ్ లో ఒకే వేదికపై చూడనున్నాం.
శత్రువులుగా మాత్రం కాదు.. ఫ్యాషన్ ఐకాన్ లుగా. బాహుబలి సినిమా స్పూర్తితో రూపొందించిన వస్త్ర శ్రేణిని ఇద్దరూ కలిసి ఫ్యాషన్ ప్రియులకు పరిచయం చేయనున్నారు. ఒక ఆన్ లైన్ షాపింగ్ పోర్టల్ కోసం ఆరుమంది ప్రముఖ డిజైనర్స్ డిజైన్ చేసిన దుస్తుల ప్రదర్శన ముంబై లో ఏప్రిల్ 7 న నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా కార్యక్రమం ప్రారంభంలో ర్యాంప్ షో ఏర్పాటు చేస్తున్నారు. ఈ ర్యాంప్ పై రానా, తమన్నా ర్యాంప్ వాక్ తో ఆకట్టుకోనున్నారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.











