Rana, Prabhas: ప్రభాస్ సినిమాపై భారీగా అంచనాలు పెంచేసిన రానా.. ఏమైందంటే?

సాధారణంగా ప్రభాస్ సినిమాలు అంటే టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్ల విషయంలో సంచలనాలు సృష్టిస్తుంటాయి. బాహుబలి, బాహుబలి2 సినిమాల తర్వాత ప్రభాస్ క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. ప్రభాస్ ప్రస్తుతం ప్రాజెక్ట్ కే సినిమాతో బిజీగా ఉండగా ఈ సినిమా రిలీజ్ కు మరో రెండు నెలల సమయం మాత్రమే ఉంది. అయితే కల్కి సినిమాపై రానా తాజాగా అంచనాలను పెంచేశారు. బాహుబలి, ఆర్ఆర్ఆర్‌లను మించి కల్కి మూవీ ఉండబోతుందని రానా కామెంట్లు చేశారు.

కల్కి 2898 ఏడీ గ్లోబల్ ఫిల్మ్ గా మారుతుందని ఈ సినిమా హద్దులను చెరిపేస్తుందని రానా (Rana) అభిప్రాయపడ్డారు. రానా ఈ కామెంట్లు చేయడంతో ప్రభాస్ ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ప్రభాస్ నాగ్ అశ్విన్ కల్కి సినిమాతో అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించడం ఖాయమని కామెంట్లు వినిపిస్తున్నాయి. కల్కి 2898 ఏడీ నైజాం రైట్స్ ఏకంగా 80 కోట్ల రూపాయల రేంజ్ లో అమ్ముడయ్యాయని సమాచారం అందుతోంది.

ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదు రుచూస్తున్నారు. కల్కి 2898 ఏడీ నుంచి త్వరలో మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియాల్సి ఉంది. కల్కి సినిమాలో నాగ్ అశ్విన్ ప్రేక్షకులకు కొత్త ప్రపంచం చూపించనున్నారని తెలుస్తోంది. కల్కి 2898 ఏడీ సినిమా ప్రమోషన్స్ ను సైతం భారీ లెవెల్ లో ప్లాన్ చేస్తున్నారని సమాచారం అందుతోంది.

దీపికా పదుకొనే, దిశా పటానీ ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. కమల్ హాసన్, అమితాబ్ ఈ సినిమాలో కీలక పాత్రల్లో కనిపిస్తున్నారు. కల్కి 2898 ఏడీ రిలీజ్ డేట్ విషయంలో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలుస్తోంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించి మరిన్ని క్రేజీ అప్ డేట్స్ రానున్నాయి.

పవర్ స్టార్ నిజంగానే రూ.100 కోట్ల ఆస్తులు అమ్మారా.. ఏమైందంటే?

‘ఆపరేషన్ వాలెంటైన్’ సెన్సార్ రివ్యూ వచ్చేసింది.. రన్ టైమ్ ఎంతంటే?
ఒకప్పుడు సన్నగా ఉండి ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయిన 11 హీరోయిన్స్.!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus