Rana: సోషల్ మీడియా వేదికగా బాలీవుడ్ హీరోయిన్ కు క్షమాపణలు చెప్పిన రానా!

టాలీవుడ్ ఇండస్ట్రీలో నటుడుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నటుడు రానా ఒకరు. అయితే తాజాగా నటుడు రానా బాలీవుడ్ హీరోయిన్ కు క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సందర్భంగా రానా బాలీవుడ్ నటి సోనమ్ కపూర్ అలాగే నటుడు దుల్కర్ సల్మాన్ కు క్షమాపణలు చెబుతూ ఈయన ట్వీట్ చేశారు. తాజాగా రానా దుల్కర్ సల్మాన్ నటించిన కింగ్ ఆఫ్ కొత్త సినిమా ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాదులో నిర్వహించిన విషయం మనకు తెలిసిందే.

ఈ కార్యక్రమానికి నేచురల్ స్టార్ నాని అలాగే రానా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ కావడంతో ఈయన బాలీవుడ్ నటికీ పరోక్షంగా క్షమాపణలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా రానా మాట్లాడుతూ తాను యాక్టింగ్ స్కూల్లో చదివే సమయంలో దుల్కర్ తన జూనియర్ అని తెలియజేశారు.తను చాలా మృదుస్వభావి. ఓపిక చాలా ఎక్కువ. ఓ సారి నేను హిందీ సినిమా షూటింగ్‌కు వెళ్లాను.

ఆ చిత్ర నిర్మాతలు నాకు చాలా సన్నిహితులు. సెట్ లో దుల్కర్ ఒకవైపు నిల్చుని ఉండగా ఆ సినిమాలో నటిస్తున్నటువంటి ఒక స్టార్ హీరోయిన్ తన భర్తతో ఫోన్లో షాపింగ్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఆమె ప్రవర్తన అక్కడ ఎవరికీ నచ్చలేదు ఆ సమయంలో దుల్కర్ చాలా ఓపికగా ఉన్నారని రానా తెలిపారు. అయితే ఆ హీరోయిన్ గురించి తాను తర్వాత నిర్మాతలతో మాట్లాడానని ఈయన తెలియజేశారు.

అయితే పరోక్షంగా రానా (Rana) మాట్లాడినటువంటి సంఘటన ‘ది జోయా ఫ్యాక్టర్‌’ అనే సినిమా సెట్‌లో జరిగిందని నెటిజన్లు నిర్దారణకు వచ్చారు. దీంతో సోనమ్‌కపూర్‌ను ట్రోల్‌ చేయడం మొదలుపెట్టారు. ఇలా రానా చేసిన ఈ వ్యాఖ్యలకు హీరోయిన్ పై ట్రోల్స్ రావడంతో ఈయన దుల్కర్ సల్మాన్ తో పాటు హీరోయిన్ సోనం కపూర్ కి కూడా క్షమాపణలు చెబుతూ చేసినటువంటి ట్వీట్ వైరల్ అవుతుంది.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus