ఆ సినిమాని నేను పట్టించుకోను.. మీరు కూడా పట్టించుకోకండి : రానా

రానా దగ్గుబాటి హీరోగా శివకుమార్ డైరెక్షన్లో ‘1945’ అనే చిత్రాన్ని మొదలు పెడుతున్నట్టు కొన్నేళ్ళ క్రితమే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రానా సైనికుడి పాత్ర పోషిస్తున్నాడు. తాజాగా దీపావళి సందర్భంగా ‘1945’ చిత్రానికి సంబంధించి ఓ పోస్టర్ ను విడుదల చేశారు. రానా సినిమాకి సంబంధించి కూడా ఓ అప్డేట్ వచ్చిందని ఆయన అభిమానులు ఆనందించేలోపే.. ఎవ్వరూ ఊహించని ట్విస్ట్ ఇచ్చాడు రానా. ఈ పోస్టర్ గురించి అలాగే సినిమా గురించి రానా తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… “ఇది ఒక అసంపూర్ణమైన చిత్రం. సినిమాను నిర్మించే విషయంలో నిర్మాత విఫలమయ్యాడు. దాంతో ఈ సినిమా అసంపూర్ణంగానే ఉంది. సంవత్సరం నుండీ నేను వాళ్ళను కలవలేదు. ఇప్పుడు వాళ్ళు పోస్టర్ ను విడుదల చేయడమనేది కేవలం డబ్బులు సంపాదించడం కోసం చేసిన మోసపు ఆలోచనలా అనిపిస్తోంది. దయచేసి దీనిని ఎంకరేజ్ చేయకండి… ” అంటూ రానా పేర్కొన్నాడు.

రానా ట్వీట్ పై నిర్మాత రాజరాజన్ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ… “సినిమా పూర్తయ్యిందా, లేదా అనేది దర్శకుడు నిర్ణయిస్తాడు. సినిమా పూర్తయ్యిందో.. లేదో ప్రేక్షకులను నిర్ణయించనివ్వండి. 60 రోజుల షూటింగ్ కోసం కొన్ని కోట్ల రూపాయలను ఖర్చు చేశాను. అసంపూర్ణమైన చిత్రాన్ని ఎవరూ విడుదల చేయరు” అంటూ పేర్కొన్నాడు.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus