ఎన్టీఆర్ బయోపిక్ లో కీలకరోల్ పోషించనున్న రానా

మహానటుడు నందమూరి తారక రామారావు జీవితంపై ఎన్టీఆర్ అనే సినిమాని తేజ మొదలెట్టి పక్కకు తప్పుకున్నారు. ఎన్టీఆర్ గా నటిస్తూ నిర్మిస్తున్న నందమూరి బాలకృష్ణ మాత్రం ఈ బయోపిక్ ని పక్కన పెట్టాలనుకోవడం లేదు. గ్రాండ్ గా తెరకెక్కించాలని పట్టుదలగా ఉన్నారు. అందుకే మరో సీనియర్ డైరక్టర్ ని ఈ సినిమా బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం అతను స్క్రిప్ట్ ని అవగాహన చేసుకునే పనిలో ఉన్నట్టు సమాచారం. అతని పేరుని ఈనెల 28 న వెల్లడించనున్నారు. ఎన్టీఆర్ పుట్టినరోజు కాబట్టి అదే రోజు మొదటి షెడ్యూల్ మొదలు పెట్టనున్నట్టు నిర్మాతల్లో ఒకరైన విష్ణు ఇందూరి వెల్లడించారు.

ప్రస్తుతం ఇందులో నటించే నటీనటులను ఖరారు చేస్తున్నారు. ఎన్టీఆర్ సతీమణి బసవతారం పాత్రని విద్యాబాలన్, ఇందిరాగాంధీ రోల్ ని నదియా, కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు పాత్రలో పరేష్ రావెల్ పోషించనున్నారు. తాజాగా ఈ సినిమాలో చంద్రబాబునాయుడు పాత్రలో రానా కనిపించనున్నట్లు తెలిసింది. మరో వారం రోజుల్లో ఈ ప్రాజక్ట్ కి రానా సైన్ చేయనున్నారు. అప్పుడే డేట్స్ ఖరారు చేయడం.. అధికారికంగా వెల్లడించడం జరుగుతాయి. బాలీవుడ్ ఛాయగ్రాహకుడు సంతోష్‌ తుండియిల్‌ సినిమాటోగ్రఫి అందిస్తున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతమందిస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ కి డైరక్టర్ మారినంత మాత్రానా రిలీజ్ విషయంలో ఎటువంటి ఆలస్యం జరగదని, వచ్చే సంక్రాంతికి ఎన్టీఆర్ మూవీ థియేటర్లోకి వస్తుందని చిత్ర బృందం స్పష్టం చేసింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus