సాయిపల్లవి సైన్ చేసిన సినిమాకి ఒకే చెప్పని రాణా
- April 17, 2019 / 07:40 PM ISTByFilmy Focus
సాధారణంగానే సాయిపల్లవి చాలా సెలక్టివ్ గా సినిమాలు చేస్తుంటుంది. కథ నచ్చి, క్యారెక్టర్ నచ్చడంతోపాటు దర్శకుడు, నిర్మాతలు అందరు నచ్చితే తప్ప సినిమా ఒకే చేయదు. అలాంటి సాయిపల్లవి చాలా కాలం తర్వాత అసలు హీరో ఎవరు అనే విషయం కూడా తెలియకుండా ఒక సినిమా సైన్ చేసింది. “నీదీ నాదీ ఒకే కథ” దర్శకుడు వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కాల్సిన ఈ చిత్రాన్ని “పడి పడి లేచే మనసు” నిర్మాత రూపొందించడానికి రెడీ కూడా అయిపోయాడు. తెలంగాణ నేపధ్యంలో పీరియాడిక్ లవ్ స్టోరీగా తెరకెక్కాల్సిన ఈ చిత్రంలో కథానాయకుడిగా రాణాను అనుకున్నారు. తెలుగు-తమిళ భాషల్లో తెరకెక్కాల్సిన ఈ చిత్రం ఇప్పటివరకూ పట్టాలెక్కలేదు.
- చిత్రలహరి రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- మజిలీ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- లక్ష్మీస్ ఎన్టీఆర్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
- ఫ్రేమకథా చిత్రం 2 రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి
అందుకు కారణం రాణా. సినిమా కథ ఒకే అయిపోయింది కానీ ఇప్పటివరకూ ఆ కథను రాణా యాక్సెప్ట్ చేయలేదని, క్యారెక్టరైజేషన్ లో కొన్ని మార్పులు కోరాడని కూడా వినికిడి. పాపం వేణు ఉడుగుల ఆ మార్పులన్నీ చేసినా కూడా రాణా ఇప్పటివరకూ ఎలాంటి సమాధానం చెప్పలేదు. దాంతో దర్శకనిర్మాతలతోపాటు.. సాయి పల్లవి కూడా రాణా ఎప్పుడు ఒకే చెప్తాడా అని వెయిట్ చేస్తోంది. సో, సాయిపల్లవి తన తదుపరి తెలుగు చిత్రం షూటింగ్ స్టార్ట్ చేయాలంటే రాణా బాబు ఒకే చేయాలన్నమాట. మరి ఈ ప్రొజెక్ట్ ఎప్పటికీ పట్టాలేక్కుతుందో చూడాలి.













