Ramayana: ‘ఆదిపురుష్’కి చేసిన తప్పే ‘రామాయణ’కి కూడా.. బాలీవుడ్ మారదా?
- July 30, 2026 / 01:23 PM ISTByFilmy Focus Desk
ఇండియన్ సినిమా మొత్తం గత కొన్ని నెలలుగా వెయిట్ చేస్తున్న సినిమా ట్రైలర్ ఎట్టకేలకు వచ్చేసింది. రూ.2000 కోట్లతో (రెండు భాగాలకు కలిపి రూ.4000 కోట్లు) రూపొందిన ఈ సినిమా ట్రైలర్‌ను చిత్రబృందం వేకువజామున బ్రహ్మ ముహూర్తం సమయంలో రిలీజ్ చేసింది. వీడియో చూడటానికి విజువల్ వండర్‌లా అనిపిస్తోంది. ఖర్చు పెట్టిన ప్రతి రూపాయి తెరపై కనిపించేలానే ఉంది. అయితే కొన్ని అంశాల విషయంలో కొన్ని అభ్యంతరాలు ఉన్నాయి. అందులో చాలా వరకు ‘ఆదిపురుష్’ సినిమా విషయంలో వచ్చినవే.
Ramayana
రణ్‌బీర్ కపూర్ – సాయి పల్లవి సీతారాములుగా నితీశ్ తివారీ తెరకెక్కిస్తున్న సినిమా ‘రామాయణ’. రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటి భాగం ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. శ్రీరాముడిగా రణ్‌బీర్ కపూర్ సరిపోయాడు. అయితే రావణుడి స్క్రీన్ ప్రజన్స్‌తో పోలిస్తే రణ్‌బీర్ అంతగా ఇంపాక్ట్‌గా కనిపించడం లేదు. అది రణ్‌బీర్ తప్పు కాదు.. ట్రైలర్‌లో రావణుడి పాత్రను ఎలివేట్ చేసిన విధానం అలా ఉంది మరి. సీత లుక్ గురించి ఎలాంటి కంప్లైంట్‌లు లేవు.

టీజర్‌లో రాముడి పాత్ర కాకుండా ఎక్కువ సేపు కనిపించిన పాత్ర ఓ విచిత్రమైన వ్యక్తి/ జంతువు. ఇప్పుడు ట్రైలర్‌లో అయితే ఎక్కువగా కనిపించి విజువల్ ఎఫెక్ట్స్, రావణుడి పాత్ర. యుద్ధమంతా మంచు ప్రాంతంలో చూపించారు. ఇదంతా చూస్తుంటే ‘ఆదిపురుష్’ సమయంలో దర్శకుడు ఓం రౌత్ చేసిన తప్పే.. ఇప్పుడు నితీశ్ తివారీ చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. ఏంటి ట్రైలర్ చూసే ఈ మొత్తం మాటలు అనేస్తారా అనొచ్చు. నిజమే చూసింది ట్రైలరే. కానీ రామాయాణాన్ని రామాయణంలా చూపించకపోతే ఇబ్బందే అవుతుంది.
ఇదంతా పక్కన పెడితే ‘రామాయణం’ అని చెబుతూ రావణుడి పాత్రను ట్రైలర్ మొత్తం ఎక్కువగా చూపిస్తూ పోతే.. అర్థం తప్పుగా వెళ్తుంది. అయితే విలన్ పవర్ ఫుల్‌గా ఉంటే హీరో పాత్ర ఎలివేట్ అవుతుందనే ఫక్తు కమర్షియల్ ఫార్ములా ఇక్కడ వాడకూదు.















