Rana Daggubati: తన పోస్ట్ తో రానాని సర్ప్రైజ్ చేసిన మిహీక బజాజ్..!

దగ్గుబాటి రానా ఎవ్వరూ ఊహించని విధంగా 2020 లో పెళ్ళి చేసుకుని షాక్ ఇచ్చాడు. ముందు నుండీ పెళ్ళి తనకి ఏమాత్రం ఆసక్తి లేదన్నట్టు చెప్పుకొచ్చిన రానా.. ‘పెళ్ళి చేసుకోవడం అసాధ్యమని అంతా అనుకున్నారు. ‘ప్రభాస్ కంటే రానా పెళ్ళి ముందు అవుతుంది’ అని రాజమౌళి చెబితే అంతా నవ్వుకున్నారు.అయితే రాజమౌళి అన్నదే జరిగింది. ఫైనల్ గా ఆమె ఓకె చెప్పింది(షి సెడ్ ఓకె) అంటూ ఓ పోస్ట్ పెట్టి అందరినీ సర్ప్రైజ్ చేసాడు రానా.

Click Here To Watch

లాక్ డౌన్ టైంలోనే రానా పెళ్ళి జరిగింది. అంత త్వరగా పెళ్ళెందుకు చేసుకున్నారు అని రానాని ఓ సందర్భంలో ప్రశ్నించగా.. ‘అరణ్య'(హాతి మేరీ సాతి) సినిమా షూటింగ్లో భాగంగా అడవిలో 2 ఏళ్ళు గడపడంతో పెళ్ళి పై ఆసొచ్చింది అంటూ సమాధానం ఇచ్చాడు. ఇదిలా ఉండగా.. రానా భార్య మిహీక సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే.అప్పుడప్పుడు తన భర్త గొప్పతనం గురించి కూడా చెబుతుంటుంది.

తాజాగా ఆమె భర్త సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఫిబ్రవరి 19కి 12 ఏళ్ళు పూర్తయిన నేపథ్యంలో ఓ పోస్ట్ పెట్టింది. ‘లీడర్’ సినిమా ఫోటోని షేర్ చేసి 12ఏళ్ళ కష్టం అని కామెంట్ చేయగా.. మరోపక్క ‘భీమ్లా నాయక్’ పోస్ట్ పెట్టి ’12 ఏళ్ళ ఎదుగుదల’ అనే అర్ధం వచ్చేలా ఈ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.ఇక మిహీక బజాజ్ ఓ ఈవెంట్ మేనేజర్ అన్న సంగతి తెలిసిందే.

తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!

Most Recommended Video

బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
సెలబ్రిటీ కపుల్స్ నయా ట్రెండ్.. ‘సరోగసీ’..!
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus