బాహుబలి రానాని ఎలా బాధ పెట్టిందో తెలుసా ?
- May 10, 2017 / 06:57 AM ISTByFilmy Focus
భారతీయ చలన చిత్ర చరిత్రలో వెయ్యికోట్ల కలక్షన్ చేసిన తొలి సినిమాగా రికార్డు సృష్టించిన బాహుబలి కంక్లూజన్ కి పని చేసిన ప్రతిఒక్కరూ గర్విస్తున్నారు. ఇందులో నటించిన నటీనటులకు మంచి గుర్తింపు వచ్చింది. ముఖ్యంగా భల్లాల దేవగా భయంకరమైన విలనిజం చూపించిన దగ్గుబాటి రానాకీ బాహుబలి చేతినిండా సినిమాలను తెచ్చి పెట్టింది. అటువంటిది రానా ఎందుకు బాధ పడుతున్నాడు? అని అనుమానం కలగవచ్చు. అక్కడికే వస్తున్నా.. బాహుబలి సినిమాలో భల్లాల దేవ విగ్రహాన్ని ప్రతిష్టిస్తారు గుర్తుంది కదా.. ఆ విగ్రహం అంటే రానాకీ భలే ఇష్టమంట.
“ఆ విగ్రహాన్ని తయారు చేసినప్పట్నుంచి ఆ విగ్రహం నాదే అనుకొన్నా. నా సొంతంగా భావించా. అలా అనుకొన్నాను కాబట్టే ఆ పాత్రలో అంతగా ఒదిగిపోయా. కానీ చివరకొచ్చేసరికి ఆ విగ్రహం ముక్కలైంది. సినిమా క్లైమాక్స్ లో భల్లాలదేవ విగ్రహం ముక్కలు చేయడం బాధ అనిపించింది’’ అని రానా ఓ ఇంటర్వ్యూ లో వెల్లడించారు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో రానా ‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా చేస్తున్నారు. వేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.













