టాలీవుడ్ లో దగ్గుపాటి రాణా అంటే బహుశా అందరికీ తెలిసి ఉండడం పోవచ్చు…ఇది మన బాహుబలి ముందు కధ…కానీ బాహుబలి తరువాత రాణా బాగా ఫేమస్ అయిపోయాడు. ఇతర ఇండస్ట్రీస్ లో కూడా రానాకు మంచి ఆఫర్స్ వస్తూ ఉన్నాయి. అయితే అదే క్రమంలో తన సినిమాల ఎంపికలో మాత్రం రానా ఆచి తూచి అడుగులు వేస్తూ సినిమాలు సెలెక్ట్ చేసుకుంటూ ఉన్నాడు. ఇదిలా ఉంటే మరో పక్క పొలిటికల్ టచ్ ఉన్న సినిమా ‘నేనే రాజు నేనే మంత్రి’ చేస్తున్న రానా…ఈ సినిమాతో ఎవరిని టార్గెట్ చేస్తున్నాడో తెలీదు కానీ…మొత్తంగా అయితే మాత్రం ఈ సినిమాలో వినిపిస్తున్న డైలాగ్స్ చూస్తూ ఉంటే అధికార పార్టీనే టార్గెట్ గా కనిపిస్తుంది. అసలు మ్యాటర్ లోకి వెళితే…రానా లేటెస్ట్ మూవీ ‘నేనే రాజు నేనే మంత్రి’ ట్రైలర్ నిన్న విడుదల అయ్యింది…ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కానీ…అసలు కధ అక్కడే మొదలయింది…ఈ ట్రైలర్ విడుదల అయిన కొద్ది గంటలకే తెలుగుదేశం పార్టీ వర్గాలలో గుబులు పుట్టిస్తోంది అన్న గాసిప్పులు వినపడుతున్నాయి.
దానికి కారణం ఈ ట్రైలర్ లో డైలాగ్స్….ఈ ట్రైలర్ లోని ”సిఎం అయితే ఎవడికి గొప్ప….వందమంది ఎమ్మెల్యేలను స్టార్ హోటల్‌కి తీసుకు వెళ్ళి దాస్తే నేను ముఖ్యమంత్రినే” అని రానా పలికిన డైలాగ్ సరిగ్గా ఇప్పుడు తెలుగుదేశ పార్టీని టార్గెట్ చేసినట్లుగా అందరూ మాట్లాడుకుంటున్నారు…అయితే ఒక పక్క ఉన్నది తెలుగుదేశం ప్రభుత్వం, మరో పక్క అప్పట్లో ఎన్టీఆర్ విషయంలో జరిగిన సంఘటనను గుర్తు చేసేదిలాగా ఈ డైలాగ్ ఉండడంతో అందరూ ఒక్కసారిగా ఈ సినిమాపై ఫోకస్ పెట్టారు…మరి ఇది కల్పిత కధనో, లేకపోతే ఎన్టీఆర్ ఎపిసోడ్ ఆధారంగా అల్లుకున్న కధనో తెలీదు కానీ…మొత్తంగా అయితే ఏమాత్రం తేడా వచ్చినా ఈ సినిమాకి ఇబ్బందులు తప్పవు అనే చెప్పాలి. చూద్దాం ఏం జరుగుతుందో.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.