Rana: హీరోయిన్ కు క్షమాపణలు చెప్పిన రానా..!

ఇటీవల జరిగిన ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో హీరో రానా మాటలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. దీంతో నేడు తన సోషల్‌ మీడియా వేదికగా దుల్కర్‌, సోనమ్‌ కపూర్‌లకు ఆయన క్షమాపణలు చెప్పారు. వాళ్లంటే తనకు ఎంతో గౌరవమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ ట్వీట్‌ వైరలవుతోంది. అసలు విషయమేమిటంటే.. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా అభిలాష్‌ జోషిలీ తెరకెక్కించిన చిత్రం ‘కింగ్‌ ఆఫ్‌ కోథా’. ఇటీవల దీని ప్రీ రిలీజ్‌ వేడుక ఘనంగా జరిగింది.

దానికి రానా, నాని ముఖ్య అతిథులుగా వెళ్లారు. ఆ ఈవెంట్‌లో రానా మాట్లాడుతూ.. ‘‘దుల్కర్‌కు చాలా సహనం. నేను ఓసారి తన సినిమా షూటింగ్‌కు వెళ్లాను. అక్కడ ఓ స్టార్‌ హీరోయిన్ చాలా సమయాన్ని వృథా చేసింది. ఆమె కోసం దుల్కర్‌ ఎండలో వేచిచూస్తుంటే.. ఆమె మాత్రం తన భర్తతో షాపింగ్‌ గురించి చాలాసేపు మాట్లాడుతూనే ఉంది. అది చూసి నాకు కోపం వచ్చింది. నా చేతిలో ఉన్న వాటర్‌ బాటిల్‌ విసిరేశాను. కానీ, దుల్కర్‌ మాత్రం చాలా ప్రశాంతంగా షూటింగ్‌ పూర్తి చేశాడు’’ అని అన్నారు.

దీంతో నెటిజన్లంతా ఆ హీరోయిన్ సోనమ్‌ కపూర్‌ అంటూ ఆమెను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. ఈ మొత్తం వ్యవహారంపై రానా తన ట్విటర్‌లో వివరణ ఇస్తూ వాళ్లకు క్షమాపణలు చెప్పారు. ‘నా వ్యాఖ్యల కారణంగా సోనమ్ కపూర్ కు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రచారంతో ఇబ్బంది పడ్డాను. అది పూర్తిగా నిజం కాదు. నిజానికి అది తేలికగా తీసుకోవాల్సిన విషయం. స్నేహితుల మాదిరి మేము తరచూ సరదాగా ఆట పట్టించుకుంటాం.

నా వ్యాఖ్యలు తప్పుగా అన్వయం అయినందుకు నేను విచారం వ్యక్తం చేస్తున్నాను. ఈ సందర్భంగా సోనమ్ కపూర్ కు హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నాను. వారిద్దరినీ నేను ఎంతో గౌరవిస్తాను. తప్పుగా అన్వయానికి నా ఈ వివరణ ముగింపు పలుకుతుందని భావిస్తున్నాను’’ అని (Rana) రానా వివరించాడు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus