Rana , Shiva Kandukuri: రానా అలా.. శివ కందుకూరి ఇలా..?

చాలా గ్యాప్ తర్వాత ఈ వీకెండ్ కి పలు క్రేజీ సినిమాలు రిలీజ్ అయ్యాయి. అందులో కాజల్ (Kajal Aggarwal) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘సత్యభామ'(Satyabhama) ఒకటి. అలాగే శర్వానంద్ (Sharwanand) హీరోగా తెరకెక్కిన ‘మనమే’ (Manamey) , నవదీప్ (Navdeep) హీరోగా తెరకెక్కిన ‘లవ్ మౌళి’ (Love Mouli), పాయల్ రాజ్ పుత్ (Payal Rajput)  ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘రక్షణ’ (Rakshana)  .. వంటివి కూడా ఈ లిస్ట్ లో ఉన్నాయి. అయితే అన్నిటికీ పర్వాలేదు అనిపించే విధంగా రివ్యూస్ వచ్చాయి. ఎక్కువగా ‘మనమే’ కి మౌత్ టాక్ బాగుంది అని చెప్పాలి.

అదేంటో కానీ ‘మనమే’ సినిమాకి ఫ్యామిలీ ఆడియన్స్ ఎగబడి వెళ్తున్నారు. వాళ్లనే టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. అలాగే యూత్ మొత్తం ‘లవ్ మౌళి’ సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ చెబుతున్నారు. కానీ బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా వీక్ గా ఉంది. ఈరోజు ఏమైనా పెరుగుతాయేమో చూడాలి. ఇదిలా ఉంటే.. ‘మనమే’ ‘లవ్ మౌళి’ సినిమాలకి ఓ స్పెషాలిటీ ఉంది. అదేంటి అంటే.. ఈ 2 సినిమాల్లోనూ మెయిన్ హీరోలు వేరైనా.. సర్ప్రైజింగ్ హీరోలు కూడా ఉండటం.

ఇంకా డీప్ గా వెళ్తే.. ‘మనమే’ సినిమాలో యంగ్ హీరో శివ కందుకూరి (Shiva Kandukuri) నటించాడు. కథకి చాలా ప్రాముఖ్యత ఉన్న పాత్ర అది. ఇంతకు మించి చెబితే స్పాయిలర్ అవుతుంది. మరోవైపు ‘లవ్ మౌళి’ సినిమాలో కూడా రానా (Rana) కనిపించి సర్ప్రైజ్ చేశాడు. మునుపెన్నడూ చూడని విధంగా ఈ సినిమాలో రానా కనిపించాడు. అతని మేకోవర్ కూడా షాక్ ఇస్తుంది. అలా ఈ ఇద్దరు హీరోలు ఈ వీకెండ్ కి ప్రేక్షకుల్ని సర్ప్రైజ్ చేశారు అని చెప్పవచ్చు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus