అజ్ఞాతవాసి సమస్య పరిష్కారానికి రంగంలోకి దిగిన రానా

జల్సా, అత్తారింటికి దారేది వంటి సూపర్ హిట్స్ ఇచ్చిన డైరక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ తో పవన్ కళ్యాణ్ చేస్తున్న మూడో సినిమా అజ్ఞాతవాసి. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పవన్ నటిస్తున్న ఈ చిత్రంలో అను ఇమ్మానియేల్, కీర్తి సురేష్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకొని జనవరి 10 న విడుదలకావడానికి సిద్ధంగా ఉంది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని అటు చిత్ర బృందం, ఇటు పవన్ అభిమానులు గట్టి నమ్మకంతో ఉన్నారు. అయితే అజ్ఞాతవాసి మేకర్స్ కి ముప్పు పొంచి ఉందని ట్రేడ్ వర్గాలవారు తెలిపారు. అది ఎలాగంటే.. అజ్ఞాతవాసి సినిమా ఫ్రెంచ్ సినిమా “లార్గో వించ్” కథను కాపీ అని సమాచారం. ప్రిన్స్ ఇన్ ఎక్సయిల్ అనే ట్యాగ్ లైన్ పెట్టడంతో.. ఈ కథ ఆ కథే అని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. “లార్గో వించ్” స్టోరీని భారతీయ అన్ని భాషల్లోకి రీమేక్ చేసుకునేందుకు టీ-సీరిస్ వారు రైట్స్ సొంతం చేసుకున్నారు. వారు మాత్రం కేసు వేయడానికి రెడీగా ఉన్నారు.

టీజర్ చూసి ఒక అంచనాకు రాలేక.. కథ మొత్తం చూసిన తర్వాత అడుగులు వేయాలని ఆ సంస్థ నిర్వహులు ప్లాన్ తో ఉన్నారు. ఈ విషయం త్రివిక్రమ్ శ్రీనివాస్ వద్దకు చేరిందని.. అందుకే తన పేరు పోవడం ఇష్టం లేక దగ్గుబాటి రానా సహాయం కోరినట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. టీ సిరీస్ కంపెనీ అధినేతతో రానాకు మంచి స్నేహం ఉందట. ఈ మేరకు వారితో మాట్లాడి ఈ సమస్య బయటికి రాకుండా పరిష్కరించాలని త్రివిక్రమ్ కోరినట్లు తెలిసింది. రానా ప్రస్తుతం ఆ పనిలోనే ఉన్నట్లు సమాచారం. టీ సిరీస్ వారు కోర్టు వరకు వెళ్లకుండా ఉండాలంటే.. పెద్ద మొత్తంలోనే డబ్బులుఅడుగుతున్నట్లు లేటెస్ట్ టాక్. మరి వారు అడిగినంత ఇస్తారా? లేకుంటే న్యాయ పోరాటానికి సిద్దమవుతారా? అనేది త్వరలోనే తెలియనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus