చంద్రబాబు వీడియోలన్నీ తెప్పించుకొని చూస్తున్నాడట

చంద్రబాబు యంగ్ వయసులో ఉండగా అంటే రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరిన సమయంలో ఎలా ఉండేవారో అప్పటి ఆ చంద్రబాబులా రాణా తనను తాను సంసిద్ధం చేసుకొంటున్నాడట. అందుకే.. సన్నబడి, కండలు కరిగించి సడన్ గా ఎవరైనా చూస్తే “ఇతడ్ని ఎక్కడో చూసినట్లుందే” అంటూ చంద్రబాబు నాయుడ్ని గుర్తు చేసుకొనేలా తయారయ్యాడు. ఇదంతా క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న “ఎన్టీఆర్” బయోపిక్ కోసమేనని ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఏముంది?.

ఎన్టీఆర్ బయోపిక్ షూటింగ్ వేగంగా జరుగుతున్నది. ఇందులో ప్రముఖమైన పాత్ర నారా చంద్రబాబు క్యారెక్టర్లో దగ్గుబాటి రానా నటిస్తున్నాడు. ఇప్పటికే రానా చంద్రబాబును కలిసి అయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాడు. బాబు క్లోజ్ ఫ్రెండ్స్ కొంతమంది దగ్గరినుంచి విలువైన సమాచారాన్ని తీసుకుంటున్నాడట. బాబు ఎలా మాట్లాడేవారు. ఎలా ఉండేవాడు అనే విషయాలు తెలుసుకుంటున్నారు. రాణా అచ్చుగుద్దినట్లుగా చంద్రబాబులా కనిపిస్తున్న ఓ ఫోటో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చంద్రబాబు యంగ్ గా ఉన్నప్పుడు ఎలా ఉండేవారో దాదాపుగా రానా అలాగే కనిపిస్తున్నాడు. నార్మల్ లుక్స్ తోనే రాణా ఇలా కనిపిస్తుంటే.. ఇక కాస్త ప్రోస్థెటిక్ మేకప్ వేస్తే సేమ్ టు సేమ్ చంద్రబాబు డూప్ లా కనిపిస్తాడేమో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus