రాజ్ తరుణ్ కోసం నిర్మాతగా మారిన రాణా బాబు

ఉయ్యాల జంపాల, కుమార్ 21ఎఫ్, సినిమా చూపిస్త మావ లాంటి వరుస విజయాల అనంతరం రాజ్ తరుణ్ ఎక్కడికో వెళ్ళిపోతాడు అనుకున్నారు అందరు. మనోడి సినిమాలు చేసే స్పీడ్ కూడా అలాగే ఉండడంతో తప్పకుండా బ్యాంకబుల్ యంగ్ హీరో అయిపోతాడని ఫిక్స్ అయిపోయారు ఇండస్ట్రీ జనాలు. కట్ చేస్తే బాబు కథలు నచ్చి కాక ప్యాకేజ్ నచ్చి సినిమాలు చేయడం మొదలెట్టాడు. దాంతో అప్పటివరకూ రేసుగుర్రంలా పరిగెట్టిన రాజ్ తరుణ్ కెరీర్ గుడ్డి గుర్రంలా తయారైంది. మనోడు నటించిన ప్రతి సినిమా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అవుతూ వచ్చింది. ఆఖరికి దిల్ రాజు కూడా బాబుకి హిట్ ఇవ్వలేకపోయాడు. దాంతో రాజ్ తరుణ్ కెరీర్ ఆదిలోనే అంతం అన్నట్లుగా తయారైంది.

ఇప్పుడిప్పుడే చేసిన తప్పులు తెలుసుకొని మెల్లమెల్లగా కెరీర్ ని సెట్ చేసుకుంటున్న రాజ్ తరుణ్ కు రాణా ఉతమివ్వడానికి రెడీ అవుతున్నాడు. రాజ్ తరుణ్ హీరోగా రాణా ఓ చిత్రాన్ని నిర్మించనున్నాడు. తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో రూపొందనున్న ఈ చిత్రం హిందీ వెర్షన్ కు అక్షయ్ కుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నాడు. ఒకవైపు రాణా, మరోవైపు అక్షయ్ కుమార్ ఇలా ఇంతమంది స్టార్ హీరోలు రాజ్ తరుణ్ కి అండగా నిలవడం అనేది మనోడి లక్ అనే చెప్పుకోవాలి. మరి సెకండ్ ఇన్నింగ్స్ ని ఎలా ప్లాన్ చేసుకుంటాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus