Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’
- October 17, 2026 / 09:58 PM ISTByPhani Kumar
విజయ్ దేవరకొండ, రష్మిక కలయికలో ‘గీత గోవిందం’ ‘డియర్ కామ్రేడ్’ తర్వాత రూపొందిన మూడో చిత్రం ‘రణబాలి'(Ranabaali). పెళ్ళైన తర్వాత రష్మిక, విజయ్ దేవరకొండ కలిసి నటించిన సినిమా కావడంతో మొదటి నుండీ ఈ సినిమాపై ఆడియన్స్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. అందులోనూ ‘టాక్సీ వాలా’ తర్వాత దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ తో విజయ్ దేవరకొండ చేసిన సినిమా ఇది. ‘ఏందయ్యా సామి’ సాంగ్, టీజర్, ట్రైలర్ వంటి వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది.
Ranabaali

కానీ సినిమాపై బజ్ అయితే క్రియేట్ అవ్వలేదు. అయితే మొదటి రోజు ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో ఓపెనింగ్స్ బాగానే వచ్చాయి. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :
| నైజాం | 3.05 cr |
| సీడెడ్ | 0.60 cr |
| ఆంధ్ర(టోటల్) | 2.15 cr |
| ఏపీ + తెలంగాణ(టోటల్) | 5.8 cr (షేర్) |
| రెస్ట్ ఆఫ్ ఇండియా | 0.67 cr |
| ఓవర్సీస్ | 2.28 cr |
| వరల్డ్ వైడ్(టోటల్) | 8.75 cr (షేర్) |
‘రణబాలి’ చిత్రానికి రూ.38 కోట్ల ధియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.39 కోట్ల వరకు షేర్ ను రాబట్టాల్సి ఉంది. మొదటి రోజు ఈ సినిమాకి రూ.8.75 కోట్ల షేర్ నమోదైంది. గ్రాస్ పరంగా రూ.17 కోట్ల వరకు కలెక్ట్ చేసింది. బ్రేక్ ఈవెన్ కోసం మరో రూ.30.25 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 2వ రోజు అడ్వాన్స్ బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి. దసరా హాలిడేస్ మిగిలే ఉన్నాయి కాబట్టి.. బ్రేక్ ఈవెన్ ఛాన్సులు అయితే ఉన్నాయి.
2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’














