Ranbir Kapoor: ప్రభాస్ రేంజ్, క్రేజ్ కు ఇదే సాక్ష్యమంటున్న నెటిజన్లు.. ఏమైందంటే?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన ప్రభాస్ కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో గుర్తింపు ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రభాస్ సినిమాలలో నటించిన నటీనటుల జాతకాలు మారిపోయి ఊహించని స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ప్రభాస్ సినిమాలో చిన్న రోల్ చేసినా చాలని చాలామంది నటీనటులు భావిస్తారు. తాజాగా ఆ జాబితాలో రణ్ బీర్ కపూర్ చేరారు. ప్రభాస్ మూవీలో చిన్న రోల్ వచ్చినా నటిస్తా అని రణ్ బీర్ కామెంట్లు చేశారు.

యానిమల్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షోకు హాజరైన (Ranbir Kapoor) రణ్ బీర్ ఈ కామెంట్లు చేశారు. ప్రభాస్ సందీప్ కాంబో మూవీ స్పిరిట్ లో చిన్న రోల్ లో అయినా చేస్తానని రణ్ బీర్ చేసిన కామెంట్లు విని ప్రభాస్ అభిమానులు ఎంతో సంతోషిస్తున్నారు. ప్రభాస్ రేంజ్, క్రేజ్ కు ఇదే సాక్ష్యమని ఈ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రభాస్ కు మాత్రమే సొంతమని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

సలార్, ప్రాజెక్ట్ కే, స్పిరిట్ సినిమాలు వేటికవే ప్రత్యేకం అని ఈ మూడు సినిమాలు బడ్జెట్ పరంగా సంచలనాలు సృష్టిస్తుండగా కలెక్షన్ల విషయంలో కూడా సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రభాస్ స్పిరిట్ మూవీలో నటించే లక్కీ ఛాన్స్ ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నటించడానికి చాలామంది హీరోయిన్లు ఆసక్తి చూపిస్తున్నారు.

వచ్చే ఏడాది నుంచి ఈ సినిమా షూటింగ్ మొదలుకానుండగా ఈ సినిమా ఏ స్థాయిలో సంచలనాలు సృష్టిస్తుందో చూడాల్సి ఉంది. ప్రభాస్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ వస్తే ఆ అప్ డేట్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సలార్ మూవీ ట్రైలర్ రిలీజ్ కు సమయం దగ్గర పడుతుండగా ఈ ట్రైలర్ లో వయొలెన్స్ మామూలుగా ఉండదని తెలుస్తోంది. ప్రభాస్ కు కెరీర్ బిగ్గెస్ట్ హిట్ దక్కాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus