సినిమాల్లో నటించాలని , సిల్వర్ స్క్రీన్ పై తమను తాము స్టార్స్ గా చూసుకోవాలని ఎంతో మందికి ఆశగా ఉంటుంది. అయితే ఆ అవకాశాలు రావటం అంత ఈజీ కాదు. వచ్చిన ప్రతి అవకాశంతో సక్సెస్ అవ్వటం చాలా కష్టం కూడా. సినీ ఇండస్ట్రీలో ప్రయాణం అంటే మన కష్టం ఎంత ఉంటుందో, అంతే అదృష్టం కూడా కలిసి రావాలి. అలాంటి పరిస్థితుల్లో కూడా నటన మీద మక్కువతో ఎంతో మంది సినీ నటులు ఒకవైపు తమకు నచ్చినా, నచ్చకపోయినా ఎదో ఒక ఫీల్డ్ లో ఉద్యోగాలు చేస్తూ ఉంటారు. రీసెంట్ గా 2026 సంక్రాంతి బరిలో నిలిచి బ్లాక్ బస్టర్ అందుకున్న ‘నారి నారి నడుమ మురారి’ చిత్రంతో విజయాన్ని అందుకున్న హీరోయిన్ సాక్షి వైద్య కూడా ఒకప్పుడు సినిమా కాకుండా వేరే రంగంలో జాబ్ చేసేదంట. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో హీరోయిన్ సాక్షి పంచుకున్న ఆ సంగతులు ఏంటో చూద్దాం..
తొలిసారిగా హీరో అఖిల్ తో ‘ఏజెంట్’ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన భామ హీరోయిన్ సాక్షి వైద్య. ఆ చిత్రం నిరాశపరచగా, ఆ తరువాత ‘గాండీవధారి అర్జున’ తో అదృష్టం పరీక్షించుకోగా ఆ మూవీ కూడా ఈ అమ్మడి ఆశలు నిరాశ అయ్యాయి. రీసెంట్ గా శర్వానంద్ హీరోగా ‘నారి నారి నడుమ మురారి’ చిత్రం మంచి టాక్ తెచుకోవటంతో ఈ భామ మళ్లి వార్తల్లో నిలిచింది. ఈ మధ్య జరిగిన ఒక ఇంటర్వ్యూ లో ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకుంది ఈ అమ్మడు. సినిమాల్లోకి రాకముందు తాను ఫీజియోథెరపిస్ట్ గా జాబ్ చేసేదానినని, సినిమాల మీద మక్కువతో ఈ రంగంలోకి వచ్చానని చెప్పుకొచ్చింది. సాక్షి మాత్రమే కాదు చాల మంది స్టార్స్, వారి గతంలో చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన సంగతి తెలిసిందే.