Netflix: సినిమాల లిస్ట్‌ అనౌన్స్‌ చేసిన నెట్‌ఫ్లిక్స్‌.. ఒక్కో సినిమాకి ఓ రేంజ్‌ హైప్‌

సినిమా హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు లైనప్‌ ఉన్నట్లే.. ఓటీటీలకు కూడా ఉంటుంది. అలా నెట్‌ఫ్లిక్స్‌ తన కొత్త సినిమాల లైనప్‌ని తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో తాము ఇంటర్నేషనల్, హాలీవుడ్ కంటెంట్‌ మాత్రమే కాదు.. తెలుగు సినిమాల కంటెంట్‌ విషయంలోనూ జోరు చూపించింది. మరి లైనప్‌లో ఏయే సినిమాలు చూద్దాం.

Netflix

పవన్ కల్యాణ్‌ – హరీష్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో స్ట్రీమ్‌ కానుంది. తొలుత ఈ సినిమా అమెజాన్‌ ప్రైమ్‌లో స్ట్రీమ్‌ అవుతుందని తెలిపారు. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌కి మారింది. వెంకటేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘ఆదర్శ కుటుంబం హౌస్ నంబర్ 47’ సినిమా నెట్‌ఫ్లిక్స్‌లోనే రానుంది. ఇది కూడా సౌత్‌ లాంగ్వేజెస్‌లో స్ట్రీమ్‌ అవుతుంది.

రామ్ చరణ్ – బుచ్చిబాబు సానా – జాన్వీ కపూర్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ‘పెద్ది’. మార్చి 27న విడుదల కానున్న ఈ సినిమా తర్వాత నెట్‌ఫ్లిక్స్‌లోకి వస్తుంది. నాని – శ్రీకాంత్ ఓదెల సినిమా ‘ది ప్యారడైజ్’ మార్చి 26న విడుదలవుతుంది అంటున్నారు. ఈ డేట్‌లో మార్పు ఉండొచ్చు. సినిమా ఓటీటీ అయితే నెట్‌ఫ్లిక్సే. ఈ సినిమా అంతర్జాతీయ భాషలోనూ రిలీజ్‌ అవుతుంది. కాబట్టి స్ట్రీమింగ్‌ విషయంలో ఓటీటీ ముందుకొచ్చింది.

దుల్కర్ సల్మాన్ కొత్త పాన్‌ ఇండియా సినిమా ‘ఆకాశంలో ఒక తార’, ఫహాద్ ఫాజిల్ ‘డోంట్ ట్రబుల్ ద ట్రబుల్’ సినిమాలతోపాటు విజయ్ దేవరకొండ – రాహుల్ సాంకృత్యాన్ సినిమా విశ్వక్ సేన్ – అనుదీప్ సినిమా ‘ఫంకీ’, సంగీత్ శోభన్ ‘రాకాస’తోపాటు రోషన్ మేక రీసెంట్‌ సినిమా ‘ఛాంపియన్’ కూడా ఈ ఓటీటీలోనే రానుంది. దీంతోపాటు నాగవంశీ కొత్త సినిమా, మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో రూపొందుతున్న ఓ చిన్న సినిమాను కూడా ఇక్కడే చూడొచ్చు. ఇలా వరుస సినిమాలో నెట్‌ఫ్లిక్స్‌ లైనప్‌ స్ట్రాంగ్‌గా పెట్టుకుంది.

ఎన్టీఆర్ కి ఆ పిచ్చి అలవాటు ఉంది.. హాట్ టాపిక్ అయిన చరణ్ కామెంట్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus