ప్రమోషన్ పెళ్లి కోసమా.. సినిమా కోసమా?

ఇప్పటి వరకూ మనం హీరోల పుట్టినరోజు నాడు చిత్ర బృందాల నుండీ ఫస్ట్ లుక్ లు.. టీజర్ లు, ట్రైలర్ లు.. విడుదల అవుతుండడం మనం చూస్తూ వచ్చాం. కానీ ఇప్పుడు హీరో పెళ్లి రోజున కూడా అతని సినిమాకు సంబంధించిన టీజర్ ను విడుదల చెయ్యబోతున్నారట. వినడానికే చాలా కొత్తగా వింతగా ఉంది కాదు. చెప్పాలంటే అది కూడా హీరోకి మెమొరబుల్ డే నే కదా..! కాబట్టి తప్పేమీ లేదు. ఇంతకీ ఆ హీరో ఎవరో.. ఆ సినిమా ఏంటో.. పైన హెడ్డింగ్ చూసినప్పుడే మీకు తెలిసిపోయి ఉంటుంది కదా..!

ఇక విషయం ఏమిటంటే.. నితిన్ మరో రెండు రోజుల్లో.. అంటే జూలై 26న పెళ్లి చేసుకోబోతున్నాడు. అయితే అతని పెళ్లి రోజున.. తన ‘రంగ్ దే’ సినిమా నుండీ టీజర్ ను విడుదల చెయ్యాలని నిర్మాతలైన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’ వారు డిసైడ్ అయ్యారాట. అందుకోసం దర్శకుడు వెంకీ అట్లూరి, సినిమాటోగ్రాఫర్ పిసి శ్రీరామ్, మ్యూజిక్ డైరక్టర్ దేవీశ్రీ ప్రసాద్ ఇదే పనిలో మంచి బిజీగా గడుపుతున్నరట. ఇక్కడ టీజర్లో రెండు డైలాగ్ లు కూడా ఉంటాయట.

వాటికి డబ్బింగ్ చెప్పడానికి హీరో నితిన్ రెండు గంటల టైం కేటాయించినట్టు సమాచారం.పెళ్లి హడావిడిలో కూడా 2 గంటల టైం ఇచ్చాడంటే గ్రేటె..! ఇక ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అంతా బానే ఉంది కానీ.. అసలు ఈ టీజర్ ప్రమోషన్ సినిమా కోసమా.. పెళ్లి కోసమా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతుండడం గమనార్హం.

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30


40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?
Most Recommended Video

40 ఏళ్ళ వయసొచ్చినా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్స్..!
విడాకులతో కోట్లకు పడగెత్తిన సెలెబ్రిటీలు!
ఈ సూపర్ హిట్లను మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరోలు..?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus