బ్రేకులేస్తాడనుకొంటే బేజారైపోయాడు!

“రంగస్థలం” చిత్రంతో బాక్సాఫీస్ ను రామ్ చరణ్ ర్యాంపాడేస్తున్నాడు. అంతకు ముందు వారం వచ్చిన “చల్ మోహన్ రంగ” జనాల్ని పెద్దగా ఎంటర్ టైన్ చేయకపోవడంతో సెకండ్ వీక్ కూడా రామ్ చరణ్ కబ్జా చేసేశాడు. ఆ సమయంలో “కృష్ణార్జున యుద్ధం”తో నాని వస్తున్నాడని తెలియడంతో.. రామ్ చరణ్ స్పీడ్ కి బ్రేక్ వేస్తాడేమో, అసలే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు కాబట్టి ఇరగ్గొట్టేస్తాడు అనుకొన్నారందరూ. కానీ.. సీన్ రివర్స్ అయ్యింది. ద్విపాత్రాభినయం కాబట్టి రెండు పాత్రల్లో నాని ఇరగదీస్తాడు, ప్రేక్షకులను బాగా ఎంటర్ టైన్ చేస్తాడు అనుకోని థియేటర్లకి వెళ్ళినవాళ్ళందరూ థియేటర్ల నుంచి ఢీలా మొఖాలేసుకొని బయటకొచ్చారు. దాంతో.. బ్రేకేస్తాడనుకొన్న నాని బేజారైపోయాడు.

ఆ కారణంగా.. మూడోవారంలోనూ రామ్ చరణ్ స్పీడ్ ని ఆపడం అనితరసాధ్యం అయ్యింది. ఇక శుక్రవారం “భరత్ అనే నేను” విడుదలయ్యేవరకూ బాక్సాఫీస్ వద్ద చిట్టిబాబు చిందులు ఆపడం ఎవ్వరి తరం కాదు. మరి భారీ అంచనాల నడుమ విడుదలకానున్న “భరత్ అనే నేను” చరణ్ స్పీడ్ కి బ్రేక్ వేస్తుందా లేక కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే ఆకట్టుకొని “రంగస్థలం” లాంగ్ రన్ కి రూట్ క్లియర్ చేస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus