నేటి ప్రేక్షకులను సుకుమార్ తన రంగస్థలం సినిమా ద్వారా 1985 నాటి కాలంలోకి తీసుకు వెళ్లనున్నారు. రామ్‌చరణ్, సమంత హీరో హీరోయిన్స్ గా నటించిన ఈ మూవీని హైదరాబాద్‌లో ఓ ప్రత్యేకమైన సెట్ లో తెరకెక్కించారు. 1985 రోజుల్లో, ఓ పల్లెటూరు ఎలా ఉంటుందో అచ్చంగా అలాంటి వాతావరణాన్ని సృష్టించారు. కళా దర్శకుడు రామకృష్ణ రూపొందించిన ఈ సెట్ కోసం 5 కోట్లు కేటాయించారు. ఇక్కడే కీలక సన్నివేశాల్ని తెరకెక్కించారు. అలాగే రాజమండ్రి పరిసరాల్లో షూట్ చేశారు. పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ని మార్చి 18న వైజాగ్ ఆరె.కె. బీచ్‌లో నిర్వహించడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ వేడుకని కూడా 1985ని తలపించేలా జరపనున్నట్లు తెలిసింది. వేదికను అందుకు అనుగుణంగా అలంకరించనున్నారు. అంతేకాదు అప్పుడు ఎంతో ప్రచారంలో ఉన్న కొన్ని అంశాలను కూడా ఈ వేడుకలో ప్రదర్శించనున్నారని టాక్. అలాగే బుర్ర కథ, తప్పెటలు, చోడవరం డప్పు వంటి వాటికి ఈ వేదికపై ఎక్కువ ప్రాముఖ్యతను ఇవ్వనున్నారట. ఈ విధంగా ఆనాటి రోజులను గుర్తుచేయనున్నారు. ఇక రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ తన పాటలతో కిరాక్ పుట్టించడం ఖాయం. ఆది పినిశెట్టి , జగపతి బాబు, అనసూయ ముఖ్య పాత్రలు పోషించిన ఈ మూవీ ఈనెల 30 న థియేటర్లోకి రానుంది.